దిశ హంతకుల ఎన్‌కౌంటర్‌ ఘటన పట్ల దేశవ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌ పోలీసులను హీరోలుగా పొగుడుతున్నారు. ఇదే స‌మ‌యంలో మహిళలపై జరుగుతున్న లైంగికదాడులు, నేరాలకు అడ్డుకట్టవేయాలంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నా అకృత్యాలు ఆగడం లేదు. దారునాల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. తాజాగా, కూతురిపై దుర్మార్గుడైన ఓ  తండ్రి లైంగిక దాడికి పాల్పడ్డాడు. పాఠ‌శాల‌కు వెళ్లిన చిన్నారిని ఇంటికి తీసుకువ‌స్తూ పొలంలోకి తీసుకువెళ్లి దారుణానికి ఒడిగ‌ట్టాడు. 11 ఏళ్ల ఆ చిన్నారికి ఏం జ‌రిగిందో కూడా తెలియ‌ని ప‌రిస్థితి. వనపర్తి మండలంలోని ఓ గ్రామంలో ఈ ఘ‌ట‌న  చోటు చేసుకుంది.

 

ఆయ‌న పేరు గాంధీ...పెళ్లాం ఉండ‌గానే అత్త‌పై రేప్‌.... ప్ర‌శ్నిస్తే ఏం చేశాడో తెలుసా?

 

వనపర్తి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పక్క గ్రామంలో ఉన్న పాఠశాలకు వెళ్లిన 11 ఏళ్ల‌ కూతురిని ఆమె తండ్రి (35) బైక్‌పై ఇంటికి తీసుకువస్తున్నాడు. మార్గమధ్యంలో ఆ దుర్మార్గుడికి పాడుబుద్ధి పుట్టింది. ప‌క్క‌నే ఉన్న‌ పొలంలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఏమీ ఎరుగ‌న‌ట్లు ఆ తరువాత ఇంటికి తీసుకెళ్లాడు. కూలీ పనులకు వెళ్లి వచ్చిన తల్లితో కూతురు జరిగిన విషయాన్ని తెలిపడంతో ఆమె షాక్‌కు లోనైంది. క‌ట్టుకున్న మొగుడే ఇలా ఆకృత్యానికి ఒడిగ‌ట్ట‌డంతో..బంధువులకు సమాచారం అందించింది. శనివారం బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితుడిపై పోక్సో కేసు నమోదుచేసి దర్యాపు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.

 

దిశ హ‌త్య‌పై మోదీ ఫోక‌స్‌... ముగ్గురు ప్ర‌ముఖుల‌ రాక‌... 4 నెల‌ల‌పాటు


కాగా, ఇటీవ‌లే జాతీయ నేర రికార్డ్స్‌ బ్యూరో (ఎన్సీఆర్బీ) సంచ‌ల‌న నివేదిక ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ప్రకారం లైంగిక దాడి కేసుల్లో చాలా తక్కువ మందికే శిక్షలు పడుతున్నాయి. 2017 గణాంకాల ప్రకారం ఈ కేసుల్లో దోషులుగా తేలినవారు కేవలం 32.2 శాతం మాత్రమే. 1,46,201 లైంగిక దాడి కేసులపై కోర్టులు విచారణ జరుపగా 5,822 మందిని మాత్రమే దోషులుగా నిర్ధారించారు. మరోవైపు చార్జిషీటు నమోదు రేటు గణనీయంగా తగ్గుతున్నది. 2013లో 95.4 శాతం ఉండగా 2017లో 86.6 శాతం నమోదైంది. అంటే సుమారు 70 శాతం లైంగిక దాడి కేసులు కోర్టుల వరకు వెల్లడం లేదని దీని ద్వారా తెలుస్తున్నది. మరోవైపు కేసుల దర్యాప్తు, విచారణ ఏండ్లపాటు సాగడంపట్ల బాధితులు విసిగిపోతున్నారు. అందుకే సత్వర న్యాయం కోసం నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయాలని బాధిత కుటుంబాలతోపాటు ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారని విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్‌, న్యాయ వ్యవస్థల్లో మార్పులు అవరసమని వారు అభిప్రాయపడుతున్నారు. అప్పుడే పైన‌న పేర్కొన్న ఘ‌ట‌న కావ‌చ్చు..ఇంకేదైనా అయి ఉండ‌వ‌చ్చు..దుర్మార్గుల ఆలోచ‌న‌ల్లో మార్పు వ‌స్తుంద‌ని పేర్కొంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: