ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబులో విపరీతమైన ఫ్రస్టేషన్ కనిపిస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇటీవల జరిగిన అనేక పరిణామాలు ఇందుకు కారణంగా వారు చెబుతున్నారు. తాజాగా శాసనసభలో శాంతిభద్రతల పరిరక్షణకు నియమించిన మార్షల్స్‌పై చంద్రబాబు ప్రవర్తించిన తీరు దారుణంగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. హుశా బ్యాలెన్స్‌ తప్పి ఫ్రస్టేషన్‌తో మాట్లాడుతున్నారన్న వాదన వినిపిస్తోంది.

 

మరి ఇంతకూ చంద్రబాబులో ఫ్రస్టేషన్ కు కారణాలేంటి.. బహుశా అధికారం చేజారడం కావచ్చు. లేదా.. ఒక్కగానొక్క కుమారుడు రాజకీయాల్లోకి తీసుకొస్తే గెలవలేకపోయాడనో.. ప్రయోజకుడు కాలేకపోయాడే బాధ కావచ్చన్నది మరో విశ్లేషణ అంతే కాదు.. మళ్లీ తిరిగి అధికారం రాదేమో అనే భయాందోళన కూడా చంద్రబాబు ఫ్రస్టేషన్‌ కు కారణం కావచ్చని అంటున్నారు.

 

ఆ కారణంగానే చంద్రబాబు ఎప్పుడూ లేని విధంగా బాస్టర్డ్ అంటూ బూతులు మాట్లాడే పరిస్థితికి చంద్రబాబు వచ్చారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్రానికి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి, దేశ రాజకీయాల్లో ప్రధాన పాత్రపోషించానని చెప్పుకునే వ్యక్తి ఇలా ఫ్రస్టేషన్ కు గురవడం, బూతులు మాట్లాడడం చాలా బాధాకరమైన అంశంగా చెబుతున్నారు.

 

ఇదే కాదు.. మొన్నటి అమరావతి పర్యటనలోనూ ఈ ఫ్రస్టేషన్ కనిపించిందంటున్నారు. మొన్న శాసనసభలో మార్షల్స్‌ అడ్డుకుంటే బాస్టర్డ్‌ అనే పదాన్ని ఉపయోగించి.. మళ్లీ నేను అనలేదు అంటున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. నూటికి నూరుపాళ్లు ఆ మాట చంద్రబాబు అన్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. అంతే కాదు.. అలవాటు ప్రకారం సభలో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించండి అంటున్నారని వారు ఆరోపిస్తున్నారు. స్పష్టంగా వినిపిస్తే ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. ఫ్రస్టేషన్‌లో ఉన్న చంద్రబాబు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: