తెలుగుదేశం పార్టీని... ఎవరు అవునన్నా కాదన్నా సరే మోసింది, బ్రతికించింది కార్యకర్తలు మాత్రమే... చంద్రబాబు వైఖరితో కీలక నేతలు పార్టీని వీడి వెళ్ళిపోయినా సరే భారీగా ఉన్న కార్యకర్తలు ఆ పార్టీని కాపాడుకుంటూ వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. అధికారంలో ఉన్న సమయంలో ఆ కార్యకర్తలను కనీసం చంద్రబాబు పట్టించుకున్న పాపాన పోలేదు అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. రాజకీయంగా వారు పార్టీని నిలబెడితే పార్టీలు మారి వచ్చిన వాళ్లకు చంద్రబాబు పెద్ద పీట వేసి వాళ్ళ అనుచరులకు న్యాయం చేసారు.

 

దీనితో పార్టీకి కార్యకర్తలు దూరం జరిగారు. ఇక ఇప్పుడు మళ్ళీ కార్యకర్తలను చంద్రబాబు నెత్తిన పెట్టుకుంటాను అంటూ మాట్లాడుతున్నారు. అది బాగానే ఉంది గాని... దేశంలో ఏ పార్టీకి లేని విధంగా అనుభంద విభాగాల బలం ఆ పార్టీ సొంతం. పార్టీలో ఉన్న కార్యకర్తల్లో చాలా మంది అనుభంద విభాగాల నుంచి ఉన్నవారే... తెలుగు యువత నుంచి న్యాయవిభాగం వరకూ కూడా పార్టీలో అన్ని విభాగాలు ఒకప్పుడు ఒక వెలుగు వెలిగాయి... అక్కడి నుంచే కార్యకర్తలు కూడా పార్టీ కోసం కష్టపడ్డారు ఇబ్బందులు పడ్డారు.

 

కార్యకర్తలను పట్టించుకుంటాను అని మాట్లాడుతున్న చంద్రబాబు కీలకంగా ఉన్న అనుబంధ విభాగాలను మాత్రం పట్టించుకోవడం లేదనే వ్యాఖ్యలు ఇప్పుడు ఎక్కువగా వినపడుతున్నాయి. తెలుగు యువతకు అధ్యక్షుడు లేడు, మహిళా విభాగానికి అధ్యక్షురాలు ఉన్నా ఆమె జనాల్లోకి వచ్చే పరిస్థితి లేదు... ఇతర విభాగాలకు అధ్యక్షులు ఎవరో కూడా కార్యకర్తలకు తెలియదు.

 

కార్యకర్తలను పట్టించుకోవడం అంటే అనుబంధ విభాగాల్లో వారికి పదవులు ఇచ్చి అండగా నిలబడటం కూడా ఒకటి... కాని కార్యకర్తలకు పని చేసే స్వేచ్చ ఇవ్వలేకపోతున్నారు. అసలు అనుబంధ విభాగాల భవిష్యత్తు ఏంటో కూడా కార్యకర్తలకు స్పష్టత రావడం లేదు. దీంతో అస‌లు ఈ విభాగాల‌ను చంద్ర‌బాబు ఏం చేస్తారు ?  త‌మ భ‌విష్య‌త్తు ఏంట‌ని పార్టీలో యూత్ వింగ్‌కు టెన్ష‌న్ ప‌ట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: