ఐరాస సర్వసభ్య సమావేశాల సమయంలో పాకిస్తాన్ ఇండియాపై ఒంటికాలిపై దూకుతూ ఇండియాను ఢీకొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని, ఇండియాను మట్టికరిపించి కాశ్మీర్ కు విముక్తి కల్పిస్తామని ప్రగల్బాలు పలికిన మాట వాస్తవం.  పాక్ రైల్వేశాఖ మంత్రి ఈ వ్యాఖ్యలను చేశారు.  ఇండియాను యుద్ధంలో ఓడించి తిరిగి కాశ్మీర్ ను సొంతం చేసుకుంటామని చెప్పిన పాక్ మంత్రి ఆ తరువాత సైలెంట్ అయ్యారు.  


జమ్మూ కాశ్మీర్, లడక్ లు పూర్తిగా కేంద్రపాలిత ప్రాంతాలుగా మారిపోయిన తరువాత పాక్ మరలా ఇండియా వైపు కన్నెత్తి చూడటం లేదు.  ఎందుకంటే ఇప్పుడు ఆ అవసరం లేదు.  గతంలో ఉంటె ఆర్టికల్ 370 ని అడ్డుపెట్టుకొని దోచుకున్నారు.  కావాల్సిన విధంగా అక్కడి ప్రభుత్వాన్ని ఆటాడించారు.  కానీ, ఇప్పుడు ఆ పప్పులు ఉడకవు.  జమ్మూ కాశ్మీర్ పూర్తిగా ఇండియాలో విలీనం అయ్యింది.  


దానిపై పాకిస్తాన్ కు ఎలాంటి హక్కు లేదు.  దానిపై ఎలాంటి వేళ్ళు కాళ్ళు పెట్టలేదు.  కాబట్టి పాక్ దూరంగా ఉండటం మొదలుపెట్టింది.  ఇక ఇండియా తమ దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీ ముస్లింలను తిరిగి వారి దేశాలకు పంపే ఏర్పాట్లు చేస్తోంది.  దానికోసమే జాతీయ పౌరసత్వం బిల్లును తీసుకొచ్చింది.  ఈ బిల్లుద్వారా దేశంలో అక్రమంగా ఉంటున్న వాళ్ళను గుర్తించి వారి దేశాలకు పంపడమే లక్ష్యం.  


ఎందుకంటే, ముస్లిం దేశాల్లో ముస్లింలు మైనారిటీలు కాదు.  కాబట్టి అక్కడ వాళ్లకు అన్ని సౌకర్యాలు ఉంటాయి.  కానీ, అక్కడ మైనారిటీలుగా ఉన్న వ్యక్తులు ఇండియాలో పౌరసత్వం ఇవ్వడానికి సిద్ధం అయ్యింది.  దీంతో ఇండియాలో ముస్లింలకు అన్యాయం జరుగుతుందని, పాక్ ఆరోపిస్తోంది.  ఇండియాకు వ్యతిరేకంగా మరోపోరాటం చేస్తామని, అవసరమైతే యుద్ధం చేసి ముస్లింలను రక్షించుకుంటామని అంటోంది పాక్.  పాక్ కోరిక నెరవేరుతుందా చూద్దాం. ఒక పాక్ యుద్ధమే కోరుకుంటే ఇండియాలోని ముస్లింలు కూడా ఇండియాకె సపోర్ట్ చేస్తారు.  ఆ విషయం పాక్ కు కూడా తెలుసు.  

మరింత సమాచారం తెలుసుకోండి: