మద్యం సేవించి కారు నడపకూడదు అని ఎన్ని విధాలుగా ప్రచారం చేసినా ఎవరూ మారడం లేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల పిల్లల వరకూ ఇదే పరిస్థితి. ప్రమాదం కొని తెచ్చుకోవడమే కాకుండా ఇతరులకు కూడా ఇబ్బంది కలిగిస్తూంటారు. ఇతరుల ప్రాణాలతో చెలాగాటమాడే ఇటువంటి ఘటనలు ఇంకా జరుగుతున్నాయి. మద్యం సేవించి వాహనం నడిపిన ఘటనలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే కుమారుడు ఉన్నాడన్న వార్త ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఎంతో భీతి గొలిపిన ఈ ఘటన విశాఖపట్నంలో జరిగింది.

 

విశాఖ బీచ్ రోడ్డులో టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ కుమారుడు కారుతో హల్ చల్ చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసాడు. మద్యం మత్తులో ఆయన కుమారుడు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఆ ప్రాంతంలో అలజడి సృష్టించాడు. అబ్బాయిగారి ర్యాష్ డ్రైవింగ్ తో ఓ టూ వీలర్‌ను కారుతో ఢీకొట్టాడు. బండారు సత్యనారాయణ కుమారుడు అప్పలనాయుడు చేసిన ఈ దురాగతానికి చంద్రశేఖర్ అనే యువకుడికి గాయాలయ్యాయి. అతివేగంతో కారు డివైడర్‌పై నుంచి దూసుకెళ్లి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఢీకొట్టింది. అక్కడే ఉన్న స్థానికులు  బండారు అప్పలనాయుడికి దేహశుద్ధి చేసారని సమాచారం. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కారులో రిటైర్డ్ పోలీస్ అధికారి కుమారుడు మౌర్య ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు మౌర్యను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే తేరుకున్న అప్పలనాయుడు ప్రమాదస్థలం నుంచి పరారయ్యాడాని సమాచారం.

 

ఈ ఘటన విశాఖలో తీవ్ర కలకలం సృష్టించింది. 2014లో బండారు సత్యనారాయణ పెందుర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో టీడీపీ హయాంలోనే మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుత టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఈయనకు స్వయానా అల్లుడు. ప్రస్తుతం ఈ ఉదంతంతో బండారుపై విమర్శలు వచ్చే అవకాశం ఉంది. దీనిపై టీడీపీ నాయకులు, పోలీసుల స్పందనేంటో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: