బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా సార‌థ్యంలోని భార‌త హోంమంత్రిత్వ శాఖ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డికి సొంత జిల్లా క‌డ‌ప‌కు చెందిన ఓ ఐపీఎస్, రెడ్డి సామాజిక‌వ‌ర్గానికి చెందిన యువ అధికారిపై హోంమంత్రిత్వ శాఖ స‌స్పెన్ష‌న్ వేటు వేసింది. తాము త‌దుప‌రి ఆదేశాలు ఇచ్చే వ‌ర‌కూ ఆయ‌న‌పై అన‌ర్హ‌త వేటు కొన‌సాగుతుంద‌ని ప్ర‌క‌టించింది. దీంతో, క‌డ‌ప‌ జిల్లాలోని లక్కిరెడ్డిపల్లె మండలం పందిళ్లపల్లెలో క‌ల‌క‌లం రేగింది.

 

ర‌క్తం మ‌రిగిపోయే దారుణం...స్కూలు నుంచి పిలిపించి..సొంత బిడ్డ‌పై రేప్ చేసిన త‌ర్వాత‌


వివ‌రాల్లోకి వెళితే...క‌డ‌ప జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలంధిలోని పందిళ్లపల్లెకు చెందిన మహేశ్వర్‌రెడ్డి సివిల్స్‌ పరీక్షల్లో 126వ ర్యాంకు సాధించి ఐపీఎస్‌గా ఎంపికయ్యారు. శిక్షణ కోసం హైదరాబాద్‌లోని సర్దార్‌ వల్లబ్‌భాయ్‌ పటేల్‌ జాతీయ పోలీస్‌ అకాడమిలో చేరారు.  అయితే, ఈనెల 12న ఆ శిక్షణ ఐపీఎస్‌ను కేంద్ర హోంశాఖ తాత్కాలికంగా విధుల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. మహేశ్వర్‌రెడ్డి ఆఫర్ ఆఫ్ అపాయింట్‌మెంట్‌ను రద్దుచేస్తున్నామని, తదుపరి ఉత్తర్వులు జారీచేసేవరకు సస్పెన్షన్ అమల్లో ఉంటుందని కేంద్ర హోం శాఖ డైరెక్టర్ ఏకే సరన్ వెల్లడించారు. 

 

జ‌గ‌న్ కొట్టిన దెబ్బ‌కు బాబుకు షాక్‌...ఇది జ‌స్ట్ ట్రైల‌రేన‌ట‌

 

ఈ సంచ‌ల‌న నిర్ణయం వెనుక ఏం జ‌రిగిందంటే...మ‌హేశ్వ‌ర్‌రెడ్డి వివాదాస్ప‌ద ప్ర‌వ‌ర్త‌నే. మహేశ్వర్‌రెడ్డి ఓయూలో ఇంజినీరింగ్ చదివే సమయంలో కీసరకు చెందిన ఓ యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దీంతో 8 ఏళ్ల‌ తర్వాత గతేడాది ఫిబ్రవరిలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహం చేసుకున్నారు. అయితే, మహేశ్వర్‌రెడ్డి ఐపీఎస్‌కు ఎంపికైన తర్వాత తనకు విడాకులు ఇచ్చి కట్నం కోసం మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడని యువతి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది. అక్టోబర్ 27న యువతి ఫిర్యాదుతో హైదరాబాద్ జవహర్‌నగర్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 498-ఏ, 323, 506, 3(1), 3(ఆర్), 3(ఎస్), 3(2)(వి)(ఏ) ఆఫ్ ఎస్సీ, ఎస్టీ పీవోఏ యాక్ట్ కింద కేసులు నమోదుచేశారు. అనంత‌రం ఈ వివాదం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప‌రిధిలోకి చేరింది. దీంతో ట్రైనీ ఐపీఎస్ కేవీ మహేశ్వర్‌రెడ్డిని శిక్షణ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: