విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్ సర్కారు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. పాఠశాలల రూపురేఖలను మార్చేందుకు నాడు – నేడు కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో బాత్‌రూమ్‌లు, బ్లాక్‌బోర్డులు, మంచినీరు లాంటి కనీస మౌలిక సదుపాయాలు లేవు.

 

వీటి అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయలు వెచ్చించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి నాడు–నేడు కార్యక్రమం అని పేరు పెట్టింది. ఈ కార్యక్రమం ద్వారా తొలిదశలో రూ.3,600 కోట్లతో 15 వేల పాఠశాలలను అభివృద్ధి చేస్తారు. మొత్తం మూడుదశల్లో రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తారు.

 

ఇప్పటికే.. వచ్చే ఏడాది జూన్‌ నుంచి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్‌ మీడియంలో బోధన అమలు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అంటే.. 2024 నాటికి మన పిల్లలంతా పదో తరగతి పరీక్షల్ని ఇంగ్లీష్‌ మీడియంలో రాస్తారన్నామాట. విద్యావ్యవస్థలో సమూల మార్పులు రావాలని జగన్ భావిస్తున్నారు.

 

అందుకే వ్యవస్థలో ఇంకా ఎలాంటి మార్పులు తెస్తే ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తాయో విద్యావంతులు, పూర్వ విద్యార్థులు సలహాలు ఇవ్వాలని కోరుతున్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా ఇంగ్లీష్ మీడియం విషయం లో వెనక్కు తగ్గడం లేదు. అమ్మఒడి కార్యక్రం కూడా అమలు చేస్తున్నారు. మరి ఈ మార్పులన్నీ ఎలాంటి ఫలితాలు ఇస్తాయో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: