ప్రపంచంలో ఎన్నో వింతలు విశేషాలు జరుగుతూనే ఉన్నాయి.  ఒక్కో వింత ఒక్కో విధమైన విషయాలను మనకు తెలియజేస్తూ ఉంటుంది.  ఇందులో భాగంగానే కొన్నిసార్లు తెలియకుండా కొంత భయాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి.  అలా భయాన్ని కలిగించే అంశాల్లో ఒకటి ఇటీవలే ఆస్ట్రేలియాలో జరిగింది.  ఓ మహిళా తన ఇంటి నుంచి చెకప్ కోసం హాస్పిటల్ కు బయలు దేరింది.  


అలా వెళ్తుండగా దారిలో గాల్లో వందల సంఖ్యలో పక్షులు ఎగురుతూ వచ్చాయి.  అలా వచ్చిన పక్షులు సడెన్ గా మాయం అవుతున్నాయి.  దీంతో సదరు మహిళకు ఏం జరుగుతుందో తెలియలేదు.  భయం వేసింది.  కానీ, హాస్పిటల్ కు వెళ్లి తిరిగి వెనక్కి వచ్చే సమయంలో విషయం తెలుసుకోవాలని అనుకుంది.  


తిరిగి వచ్చే సమయంలో అదే మార్గంలో వస్తుండగా నిజంగానే భయానకమైన దృశ్యాలు కనిపించాయి.  ఆకాశంలో చక్కర్లు కొడుతున్న పక్షులు సడెన్ గా తలలు పగిలి నేలపై పడి మరణిస్తున్నాయి.  ఆ దృశ్యాలను చూసి షాక్ అయ్యింది మహిళ.  ఇంటికి తిరిగి వచ్చిన తరువాత సదరు మహిళ ఈ విషయాన్ని ఆమె భర్తకు తెలిపింది.  


మొదట్లో భర్త నమ్మలేదు.  కానీ, తరువాత ఆమె మాటలను అనుసరించి ఆ ప్లేస్ కు వెళ్ళాడు.  నిజమే... అక్కడ పక్షులు వందల సంఖ్యలో గాల్లో తిరుగుతూ వచ్చి నేలపై పడి మరణిస్తున్నాయి.  ఎందుకు అలా జరుగుతుందో తెలుసుకోలేకపోయారు.  వెంటనే విషయాన్ని వాతావరణశాఖ, పోలీసులకు సమాచారం అందించారు.  ప్రసుత్తం దీనిపై పోలీసులు, పర్యావరణ వేత్తలు దర్యాప్తు చేస్తున్నారు.  ఎందుకు అలా జరుగుతుందో ఇప్పటికి వారికీ మిస్టరీగానే ఉండిపోయింది. ఇలాంటి మిస్టరీలు ప్రపంచంలో కోకొల్లలుగా జరుగుతున్నాయి.  అయితే, పక్షలు వాటంతట అవే ఎలా తలలు పగిలి చనిపోతున్నాయనే విషయం ఇప్పటికి ఎవరికీ అర్ధం కావడం లేదు.  ఆ ప్రాంతంలో దెయ్యాలు ఉన్నాయని కొందరు అంటున్నారు.  ఇందులో ఎంతవరకు నిజం ఉందొ తెలియాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: