దేశంలో వినియోగించే పసుపును ఎక్కువ మొత్తంలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఎగుమతి చేస్తారు అన్న విషయం తెలిసిందే. అయితే పసుపు రైతులకు సరైన మద్దతు లేకపోవడంతో నష్టాల్లో కూరుకు పోతున్నారు పసుపు రైతులు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక పసుపు బోర్డు ఏర్పాటు అవుతుందని సమస్యలు తీరిపోతాయని అనుకున్నారు పసువు రైతులు . నిజాంబాద్ ఎంపీ గా కేసిఆర్ కూతురు కల్వకుంట్ల కవిత వచ్చినప్పటికీ పసుపు రైతుల సమస్యలు మాత్రం తీరలేదు. దీంతో కవితకు వ్యతిరేకంగా  పసుపు రైతులు పార్లమెంట్ ఎలక్షన్లో భారీ మొత్తంలో నామినేషన్లు వేసిన విషయం తెలిసిందే.

 

 

 అయితే ఇదే క్రమంలో బిజెపి ఎంపీ పసుపు రైతులకు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. తనను గెలిపిస్తే కేంద్రం నుంచి ఎట్టి పరిస్థితుల్లో పసుపు బోర్డు తీసుకోస్తానని ప్రకటించారు. పసుపు బోర్డు తీసుకురా లేకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని నిజాంబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. చివరకు ఆయన  బాండ్ పేపర్ మీద కూడా రాసిచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం పసుపు బోర్డు  సాధ్యంకాదని ఎంపీ ధర్మపురి అరవింద్ చెబుతున్నారు. పసుపు రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని... రైతులకు పసుపు బోర్డు కంటే ఎక్కువ ప్రయోజనాలు చేకూర్చే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకుందని ఎంపీ ధర్మపురి అరవింద్ తెలుగు తెలిపారు . 

 

 

 రైతుల కోసం ప్రతి ఏడాది 100 కోట్ల రూపాయల నుంచి 200 కోట్ల రూపాయల  నిధులు ఇస్తున్నామని ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు. పసుపు  రైతులందరికీ సీడ్, ఎరువులు,  అమ్మకం,  కొనుగోలు,  ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించిన అంశాలను ఇక్కడే  నిర్వహిస్తామని... పసుపు  బోర్డు కంటే ఎక్కువ ప్రయోజనాలు చేకూర్చే విధంగా కొత్త స్కీమ్ రైతులకు అందిస్తామంటూ నిజాంబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. రైతులందరూ ప్రలోభాలకు గురి రాజకీయ నాయకుల వలలో పడొద్దని  ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్  పసుపు మద్దతు ధర ప్రకటించగా..  తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ప్రకటించకూడదని అయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ పసుపు మద్దతు ధర ప్రతిపాదనలు పంపిస్తే కేంద్రం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని ఎంపీ  అరవింద్ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: