గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైసీపీ మహిళా ఎమ్మెల్యే విడదల రజనీ ప్రజల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలలో పాల్గొంటూ నియోజిక ప్రజలకు అందుబాటులో ఉంటారు. దాంతో ప్రజల మధ్య ఆమెకు చాలా మంచి పేరు ఉంది. 3 వారాల క్రితం ఆమె మీద అభిమానంతో ఒక బుడ్డోడు బుగ్గ గిల్లి, ముద్దుపెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే మళ్ళీ ఈరోజు ఆమె వార్తల్లో నిలిచింది కానీ అది గతంలో లాగా మంచి విషయం కాదని చెప్పుకోవచ్చు.



వివరాల్లోకి వెళితే, నెల్లూరికి చెందిన ఇద్దరు టీడీపీ సానుభూతిపరులైన వ్యక్తులు ఫేస్‌బుక్‌లో ఎమ్మెల్యే రజనీపై అభ్యంతరకర కామెంట్లు చేసారు. అయితే, ఆ వ్యక్తులను నెల్లూరు జిల్లా విడవలూరుకు చెందిన సత్యవోలు హరిప్రసాద్‌రెడ్డి అలియాస్‌ సత్యంరెడ్డి, అదే జిల్లా రాపూరు మండలం కండలేరు డ్యాంకు చెందిన పంతగాని ప్రవీణ్‌లుగా పోలీసులు గుర్తించారు. హరిప్రసాద్ అవమానకర పోస్ట్ పెట్టగా, ఆ పోస్ట్ కింద కామెంట్ బాక్స్ లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు ప్రవీణ్. ఇది చూసిన చిలకలూరిపేటకు చెందిన వైసీపీ నేత మారుబోయిన నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

 

అతని పిర్యాదు చేయడంతో... శనివారం రోజు రాత్రి చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ-509,సెక్షన్ 67 ఐటీ యాక్ట్‌-2018 కింద ఇద్దరిపై కేసు నమోదు చేసారు. ఆ తర్వాత ఆదివారం రోజు వారిని తమ సొంత గ్రామాలలో పోలీసులు అరెస్టు చేసారు. రేపు అనగా సోమవారం రోజు వారిని న్యాయస్థానంలో హాజరుపరిచే అవకాశం ఉంది.


ఇకపోతే, తాజాగా ఏపీ సర్కార్ దిశ చట్టం తీసుకొచ్చింది. అయితే ప్రస్తుతం చట్టంలో తెచ్చిన మార్పులు చాలా కఠినంగా ఉన్నాయి. సామజిక మాధ్యమాలలో మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే రెండేళ్ల శిక్ష, రిపీట్ చేస్తే నాలుగేళ్ళ జైలు శిక్ష విధించనున్నారన్న విషయం విదితమే. 

మరింత సమాచారం తెలుసుకోండి: