జగన్మోహన్ రెడ్డి పరిపాలన తెలంగాణా సిఎం కేసియార్ లో కూడా హీటు పెంచేస్తోంది.  మొదట్లో కేసియార్ ను జగన్ అనుసరించినట్లు కనిపించారు. కానీ ఓ మూడు నెలలు గడిచేటప్పటికి కేసియారే తనను ఫాలో అవుతున్నారనే విధమైన పాలనను అందించటంలో జగన్ సక్సెస్ అయ్యారు. అందుకనే ఇద్దరి మద్య గ్యాప్ వచ్చేసినట్లు కొత్తపలుకులో వేమూరి రాధాకృష్ణ కూడా చెప్పారు.

 

ఏపిలో జగన్ తీసుకుంటున్ని కొన్ని నిర్ణయాలు తెలంగాణాలో కేసియార్ ను ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నట్లు సమాచారం.  ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నా జగన్ అమలు చేస్తున్న కొన్ని సంక్షేమ పథకాలు తెలంగాణాలో ఎందుకు అమలు చేయటం లేదని కేసియార్ పై వివిధ వర్గాల నుండి ఒత్తిళ్ళు పెరుగుతున్నాయట.  ఆర్టీసీని కార్యికులు, ఉద్యోగులను ప్రభుత్వంలో  విలీనం చేయాలనే డిమాండ్ తో జరిగిన ఆర్టీసీ సమ్మే ఇందుకు ఉదాహరణ.

 

అలాగే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార ఘటన విషయం కూడా కేసియార్ పై ఒత్తిడి పెంచేస్తోంది. ఘటన జరిగింది తెలంగాణాలోనే అయినా దాని ఆధారంగా ఏపిలో జగన్ తీసుకొచ్చిన దిశ యాక్ట్-2019 ప్రభావం కేసియార్ పై పడింది.  నిందితులకు 21 రోజుల్లోనే మరణశిక్ష పడేట్లుగా జగన్ తీసుకొచ్చిన కొత్త చట్టం లాంటిదే తెలంగాణాలో కేసియార్ ఎందుకు తీసుకురావటం లేదంటూ వివిధ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. పైగా కొత్తచట్టం చేసినందుకు జగన్ కు దేశవ్యాప్తంగా జేజేలు పలుకుతున్నారు.

 

జగన్ తీసుకున్న  ఇటువంటి అనేక ఘటనలు కేసియార్ పాలనపై కచ్చితంగా ప్రభావం చూపుతున్నాయి. జగన్ సిఎం కాగానే తన గుప్పిట్లోనే ఏపి పాలన కూడా ఉంటుందని బహుశా కేసియార్ అనుకునుండచ్చు. కానీ మూడు నెలలు గడిచిన తర్వాత చూస్తే తెలంగాణాలో కూడా జగన్ కు క్రేజు పెరిగిపోతోంది. అంటే జగన్ పాలనే కేసియార్ పైన కూడా పడుతోందన్న విషయం అర్ధమైపోతోంది. ఈ ప్రభావమే కేసియార్ పై ఒత్తిడి పెంచేస్తోంది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: