ఏబిఎన్-ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ నాయుడు మీద కూడా జీవో 2430 ప్రభావం చూపుతున్నట్లే అనిపిస్తోంది.  24 గంటలూ జగన్ కు వ్యతిరేకంగా విధ్వేషపూరితమైన రాతాలు రాసే రాధాకృష్ణలో మార్పు కనిపిస్తోంది. ఆదివారం రాసే కొత్తపలుకులో  రెండు మూడు అంశాలపై జగన్ గ్రేట్ అని అంగీకరించారు. మొన్నటి వరకూ జగన్ మంచిపని చేసినా సరే అందులో తప్పులు మాత్రమే వెతికే వేమూరిలో ప్రభుత్వం తెచ్చిన జీవో ప్రభావం కనిపిస్తోందనే  అనుమానలు మొదలయ్యాయి.

 

అదే సమయంలో  రెండు మూడు అంశాల్లో చంద్రబాబునాయుడు ఫెయిలయ్యాడని అంగీకరించారు.  ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టే విషయంలో చంద్రబాబు  ముందు తీవ్రంగా వ్యతిరేకించి తర్వాత యుటర్న్ తీసుకున్న విషయం తెలిసిందే. అదే విషయాన్ని వేమూరి ప్రస్తావిస్తు బడుగుల మనోభావాలను చంద్రబాబు పట్టించుకోలేదని స్పష్టంచేశారు.  జనాల మనోభావాలను పసిగట్టడంలో చంద్రబాబు ఫెయిలైన విషయాన్ని వేమూరి అంగీకరించారు.

 

అసెంబ్లీ మార్షల్స్ తో చంద్రబాబుకు జరిగిన గొడవలో కూడా ప్రతిపక్ష నేత విఫలమయ్యారని అంగీకరించారు. చీఫ్ మార్షల్ ను చంద్రబాబు బాస్టర్డ్ అన్నట్లు ఆడియో, వీడియో క్లిప్పుంగుల్లో తెలుస్తోంది. అయితే ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డితో పాటు మంత్రులు, సభ్యులు చేసిన ఆరోపణలతో చంద్రబాబు ముందు కంగుతిన్నారట. తర్వాత తాను అనలేదని తన బ్యాకాఫీసు సమాచారం ఇవ్వటంతో అడ్డం తిరిగారంటు ఓ కథ అల్లారు.

 

నిజానికి చీఫ్ మార్షల్ ను చంద్రబాబు తిట్టిన విషయం వాస్తవమే అని అందరూ నమ్ముతున్నారు. ముందు నోటికొచ్చినట్లు అనేయటం తర్వాత ఇబ్బంది ఎదురైనపుడు తాను అలా అనలేదని మాట మార్చటం చంద్రబాబుకు బాగా అలవాటే అన్న విషయం అందరికీ తెలిసిందే.  బడుగు, బలహీనవర్గాలను చంద్రబాబు, కమ్మ సామాజికవర్గానికి వ్యతిరేకం చేయటంలో జగన్ సక్సెస్ అయినట్లు వేమూరి అంగీకరించారు. అంటే వేమూరి లెక్కప్రకారమే చంద్రబాబు అధికారంలో ఉన్నపుడే కాదు ప్రతిపక్షంలో కూడా ఫెయిలయ్యారని అర్ధమైపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: