ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు కష్టపడితేనే గాని నెల జీతం చేతికి రాదు.  అలా నెల జీతం వచ్చిన వెంటనే అన్ని ఖర్చులు అయిపోతాయి.  తిరిగి ఖర్చులకు డబ్బులు మాములుగా ఉండదు.  ఇంకా ఎక్కువగా జీతం కావాలి అంటే మరికొంత సేపు అదనంగా పనిచేయాలి లేదంటే వేరే వేరే పనులు చేస్తుండాలి.  అలా చేయలేకపోతే జీవితంలో కావాల్సినవి తీసుకోలేని పరిస్థితి వస్తుంది.  

 


అందుకే కొంతమంది జీతం కోసం జీవితాన్ని పణంగా పెట్టి పనులు చేస్తుంటారు.  ఆ పనుల ద్వారా కొంతవరకు సక్సెస్ అవుతుంటారు.  మరికొందరు పెద్దగా సక్సెస్ కాలేరు.  సక్సెస్ కావడం కోసం పడే తపనతో ఇంటిని, సొంత విషయాలను కూడా మర్చిపోతుంటారు.  ఫ్యామిలీని మర్చిపోతారు.  కష్టం ఒక్కటే వారి కళ్ళముందు ఉంటుంది.  

 


అయితే, అలా కష్టపడుతున్న తన తండ్రి బాధను చూసి చలించిపోయిన ఆరేళ్ళ చిన్నారి ఏకంగా ముఖ్యమంత్రికి లేఖ రాసింది.  ఏమని రాసిందో తెలుసా ? తన తండ్రి ఎక్కువ జీతం కోసం ఎక్కువ సమయం పనిచేస్తున్నారని, దీంతో ఇంటికి సరిగా రావడం లేదని, తనతో సమయం ఎక్కువగా గడపలేకపోతున్నారని తన తండ్రికి జీతం పెంచాలని కోరుతూ మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాసింది చిన్నారి.  

 


చిన్నారి తండ్రి మహారాష్ట్ర ఆర్టీసీలో కండక్టర్ గా పనిచేస్తున్నారు.  తన కూతురు ఇటీవలే ఓ ఉత్తరం రాసి పోస్ట్ చేయమని తనకు ఇచ్చిందని, తాను దానిని నార్మల్ పోస్ట్ చేశానని, అది ముఖ్యమంత్రికి చేరిందో లేదో తెలియదని, కానీ, తన చిన్నారి కోరికను తీర్చలేకపోతున్నానని, కుటుంబం కోసం ఎక్కువగా కష్టపడాల్సి వస్తోందని ఆ తండ్రి తన ఆవేదనను తెలిపాడు.  నిజమే చాలామంది తమ కుటుంబాలను పోషించుకోవడానికి జీవితాన్ని పణంగా పెడుతున్నారు.  ఆరోగ్యాలను పాడుచేసుకుంటున్నారు.   

 

మరింత సమాచారం తెలుసుకోండి: