గత కొంతకాలంగా ప్రజలను విపరీతంగా ఇబ్బందులు పెడుతున్న అంశం ఏదైనా ఉందా అంటే అది ఉల్లి అని చెప్పాలి.  ఉల్లి ప్రజలను నానా ఇబ్బందులు పెడుతున్నది.  గత మూడు నెలలుగా ఉల్లి అంశం తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నది.  ఉల్లిపాయల  ధరలు గణనీయంగా పెరిగిపోయాయి.  ఒకటికాదు రెండు కాదు కేజీ 200 వరకు చేరుకుంది.  దీంతో ప్రజలు ఉల్లి కొనేందుకు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.  


ఉల్లిపంట చేతికి వచ్చే సమయంలో అకాలంగా వర్షాలు కురిశాయి.  వర్షాలు విపరీతంగా కురవడంతో ఉల్లి పంట చేతికి రాలేదు.  దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.  మార్కెట్ లో ఉల్లి తగ్గిపోయింది.  డిమాండ్ కు తగినట్టుగా సప్లై లేకపోవడంతో ధరలు పెరిగాయి.  కొండెక్కాయి.  చివరకు ఉల్లి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.  ఇప్పుడు దేశంలో కొంతవరకు ధరలు తగ్గినా డిమాండ్ మాత్రం తగ్గడం లేదు.  


ప్రజలకు ఉల్లి కొనాలంటే భయపడుతున్నారు.  అయితే, రైతులు మాత్రం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.  ఉల్లికి ఎప్పుడు గిట్టుబాటు ధరలు పెద్దగా ఉండేవి కాదు.  లాభాలు పక్కన పెడితే సంవత్సరంలో పండించిన పంటకు తగిన డబ్బులు కూడా రాకపోవడంతో ఇబ్బందులు పడ్డారు.  అయితే, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది ఒకప్పుడు కింటా ధర వందల్లో ఉంటె ఇప్పుడు రూ. 15వేలు పలుకుతుంది.  దీంతో ఉల్లిరైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.  


కర్ణాటకకు చెందిన మల్లిఖార్జున్ అనే రైతు ఎన్నో ఏళ్లుగా ఉల్లి పంటను పండిస్తున్నాడు.  ఈ పంటను పండించిన ప్రతి సారి పాపం నష్టాలు వస్తుండేవి.  పెద్దగా లాభాలు వచ్చేవి కాదు.  ఈసారి ధైర్యం చేసి తనకున్న పదెకరాల పొలంతో పాటు మరో పదెకరాల పొలం తీసుకొని ఉల్లిసాగు చేశారు.  అదృష్టం బాగుంది.  ఉల్లి మంచి దిగుమతి వచ్చింది.  దీంతో రోజుకు వందల కింటాల చొప్పున ఉల్లి ఏడుగుమతి చేయడం మొదలుపెట్టాడు.  20 ఎకరాల పొలంలో 20 లక్షల వరకు ఖర్చు చేయగా, ఇప్పటి వరకు కోటి రూపాయలకు పైగా డబ్బు వచ్చిందని, ఆ డబ్బుతో అప్పులు తీర్చి మంచి ఇల్లు కట్టుకుంటానని అంటున్నాడు రైతు.  

మరింత సమాచారం తెలుసుకోండి: