ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యదు అంటారు పెద్దలు. ఎందుకంటే ఉల్లి తినడం వల్ల అన్ని లాభాలు ఉంటాయి. అయితే ఈ ఉల్లిపాయ వల్ల ఎన్నో ఆరోగ్యసమస్యలు పోతాయి.. రావు. అయితే ఈ ఉల్లిపాయ ధరలు నిన్నటి భారీగా పెరిగాయి. ప్రతి ఒక్కడికి ఈ ఉల్లి మంట బాగా అంటుకుంది. ఇంకా కొంతమంది అయితే ఈ ఉల్లిపాయని కొనడానికి ప్రయత్నించి ప్రయత్నించి గుండెపోటు వచ్చి మరణించారు. 

 

అయితే ఈ ఉల్లి మొన్న ఈ మధ్య తగ్గింది. కానీ పూర్తి స్థాయిలో తగ్గలేదు. అలా ఉల్లిపాయ తగ్గినప్పటికీ రేటు మాత్రం భారీగానే ఉంది. దీంతో ఉల్లిపాయను కొనలేని పరిస్థితి. అయితే దేశమంతా 150, 200 రూపాయిలు ఉన్న ఉల్లిపాయ ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం 25 రూపాయలకే వచ్చేల ఆంధ్ర ప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 

 

అయితే ఈ ఉల్లి కోసం ఏపీలో ఎదురు చూసి చూసి.. ఒకరు గుండె పోటుతో మరణిస్తే.. మరికొందరు తీవ్రంగా గాయాలు పాలయ్యే విధంగా కొట్టుకుంటున్నారు. అలానే నిన్న పార్వతీపురంలోని రైతు బజారులో కొద్ది రోజులుగా రెండు రోజులకు ఒకసారి ఉల్లిపాయలు సబ్సిడీ కింద అందజేస్తున్నారు. అయితే నాలుగు రోజులుగా ఉల్లిపాయలి పంపిణీ నిలిచిపోయింది. 

 

దీంతో అధికారులు నిన్న శనివారం మళ్ళి ఉల్లిపాయల పంపిణీని ప్రారంభించారు. విషయం తెలుసుకున్న స్థానికులంతా ఉదయమే  క్యూ లైన్లలో నిలబడ్డారు. వృద్ధులు, మహిళలు, చిన్నారులు చలిని సైతం లెక్కచేయకుండా అందరూ రైతు బజార్ గేటు దగ్గరే పడిగాపులుకాచారు. అయితే కొద్దిసేపటికి అధికారులు వచ్చి గేటుకు తాళం తీశారు. 

 

దీంతో జనాలు ఒక్కసారిగా లోపలికి వచ్చేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఆ సమయంలోనే కొంతమంది మహిళల మధ్య మాటల యుద్ధం జరగగా అది కాస్త పెద్దది అయ్యేసరికి ఒకరిపై మరొకరు తీవ్రంగా దాడి చేసుకున్నారు. ఇంకా ఆ దాడిని జరిగింది జరిగినట్టు వర్ణనిచాలంటే జుట్లు పట్టుకొని మరీ ఆ మహిళలు కొట్టుకున్నారు. అంత గొడవ జరిగి ఉల్లి కొనేవారు కొని వచ్చి ఆ యుద్దని చూశారు. అయితే ఇది అధికారులకు తెలియడంతో వారు వచ్చి సర్దిచెప్పి పంపారు. చూశారా.. ఉల్లికోసం పరువును సైతం లెక్కచేయడం లేదు ఈ ఆడోళ్ళు.  

మరింత సమాచారం తెలుసుకోండి: