డిసెంబర్ 15 న దక్షిణ ఢిల్లీ లో   హింసాకాండ జరిగిన కొన్ని గంటల తరువాత, పరిస్థితి అదుపులో ఉందని, సవరించిన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసనల  సందర్భంగా కాల్పులు, విధ్వంసాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కొంతమంది వ్యక్తులను పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు.    పోలీసుల కధనం ప్రకారం,  ఆదివారం మధ్యాహ్నం దక్షిణ    ఢిల్లీ లోని  న్యూ ఫ్రెండ్స్ కాలనీ ప్రాంతానికి సమీపంలో నిరసనకారులు హింసకు పాల్పడిన తరువాత, పరిస్థితిని నియంత్రించడానికి మాత్రమే తాము  జామియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలోకి ప్రవేశించాము అని అన్నారు.

 

 

 

 

 

 

 

నిరసన సందర్భంగా నాలుగు బస్సులు, రెండు పోలీసు వాహనాలను తగలబెట్టారని, ఆరుగురు పోలీసులు కూడా గాయపడ్డారని డిప్యూటీ కమిషనర్ (ఆగ్నేయం) చిన్మోయ్ బిస్వాల్ తెలిపారు. పోలీసు సిబ్బంది పై యూనివర్సిటీ క్యాంపస్  లోపల నుండి రాళ్ళు విసిరారని , వాళ్ళను  చెదర గొట్టడానికి టియర్ గ్యాస్  ఉపయోగించమని  ఆయన అన్నారు.  కొంతమందిని అదుపులోకి తీసుకున్నామని బిస్వాల్ తెలిపారు.    జామియా మిలియా ఇస్లామియా విద్యార్థుల సంఘం మరియు ఉపాధ్యాయ సంఘంలు   డిసెంబర్ 15 మధ్యాహ్నం విశ్వవిద్యాలయం సమీపంలో జరిగిన హింస మరియు కాల్పులతో తమకు సంబంధం లేదని  తెలిపాయి.

 

 

 

 

 

 

 

 

ఢిల్లీ  పోలీసు సిబ్బంది ఎటువంటి అనుమతి లేకుండా బలవంతంగా విశ్వవిద్యాలయంలోకి ప్రవేశించారని, యూనివర్సిటీ  సిబ్బంది మరియు విద్యార్థులను కొట్టారని జామియా చీఫ్ ప్రొక్టర్ వసీం అహ్మద్ ఖాన్ పేర్కొన్నారు. విశ్వ విద్యాలయ వైస్-ఛాన్సలర్ నజ్మా అక్తర్ మాట్లాడుతూ లైబ్రరీ లోపల ఉన్న విద్యార్థులను బయటకు తీసుకెళ్లామని, వారు  సురక్షితంగా ఉన్నారని అన్నారు.  నజ్మా  అక్తర్ పోలీసు చర్యను ఖండించారు.

 

 

 

 

 

ఢిల్లీ  పోలీసులు లైబ్రరీలో జామియా విద్యార్థులను ఘెరావ్ చేశారని,   బస్సు దహనం సంఘటనకు మేము బాద్యులము కాదని  , అది చేసిన వారు వర్సిటీ నుండి కాదు బయటి వ్యక్తులు అని,  అమాయక విద్యార్థులను పోలీసులు  లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని ఒక  విద్యార్థి పేర్కొన్నాడు.   మరికొందరు విద్యార్థులను పోలీసులు అదుపు లోకి తీసుకున్నారని ఆరోపించారు, కాని ఢిల్లీ  పోలీసుల నుండి ఎటువంటి ధృవీకరణ రాలేదు, వారు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం పై దృష్టి సారించారని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: