నారా లోకేష్ సోషల్ మీడియా వేధిక సంచలన ట్విట్లు చేస్తున్నాడు. చెయ్యలేరు అనుకుంటున్నాడో ఏమో తెలియదు కానీ.. ట్విట్టర్ లో సంచలన ట్విట్లు చేస్తున్నాడు నారా లోకేష్. ఈ మేరకు నారా లోకేష్ ఇలా ట్విట్ చేశారు. ''మహిళలపై అత్యాచార ఘటనలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.. 

                       

దిశ బిల్లు ఆమోదం పొందినరోజే ప్రకాశం జిల్లాలో యువతిపై అత్యాచారం జరిగింది.. దిశ చట్టంపై ప్రజల్లో అవగాహన పెరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.. కొత్త చట్టం ప్రకారం త్రిపురాంతకం ఘటనలో నిందితుడికి 21 రోజుల్లోనే శిక్ష పడేలా చేయాలి అంటూ ట్విట్ చేశారు. 

                         

ఈ ట్విట్ కు స్పందించిన నెటిజన్లు.. జీవం పొసే 'ఆమె'కు జీవించే హక్కును మృగాళ్లు హరిస్తున్నారు.. అంటూ ట్విట్ చేశారు. కాగా ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ అత్యాచార ఘటనపై తీవ్రంగా స్పందించాలని వైసీపీ ప్రభుత్వాన్ని లోకేష్ కోరారు. అయితే ఈ ట్విట్ లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

                                    

కాగా ఆంధ్రాలో వైసీపీ ప్రభుత్వం ఆడపిల్లలపై జరిగే అత్యాచారాలు ఆపాలని.. అత్యాచారం చేసిన నిందితుడికి కేవలం 21 రోజులలో ఉరి శిక్ష పడేలా దిశ చట్టన్నీ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్తం ఆమోదం పొందిన రోజే యువతిపై అత్యాచారం జరిగింది. మరి ఈ ఘటన పట్ల ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. 

                 

మరింత సమాచారం తెలుసుకోండి: