అత్యాచారం.. ఇప్పుడు ఇది ట్రేండింగ్ టాపిక్. ఎక్కడ చుసిన అత్యాచారాలే.. ఎప్పుడు చూడు అత్యాచారాలే. భారత్ లో ప్రతి 20 నిమిషాలకు ఒక అత్యాచారం జరుగుతుంది. అంతటి ఘోరంగా ఈ అత్యాచారాలు జరుగుతున్నాయి. భారత్ లో జరిగే అత్యాచారాలలో కేవలం 40 శాతం అత్యాచారాలు మాత్రమే బయటకు వస్తున్నాయి. 

 

అయితే ఇప్పుడు తాజాగా దేశవ్యాప్తంగా మహిళలపై జరిగే అత్యాచారాలు పెరిగిపోవడంపై ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. రేపిస్టులు కనిపిస్తే కొట్టి చంపేయాలన్న కసి ప్రజలలో కనిపిస్తుంది. అయితే ఇటీవలే తెలంగాణాలో దిశ ఘటన ఎంత సంచలనమైందో అందరికి తెలిసిందే. 

 

అయితే ఈ అత్యాచారాలు ఘటనలు చూసి చూసి విరక్తి వచ్చిన ఓ వ్యక్తి ఓ బంపర్ ఆఫర్ ప్రకటించాడు. ఆ బంపర్ ఆఫర్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. అసలు ఆ ఆఫర్ ఏంటి అనుకుంటున్నారా ? ఇంకా అసలు విషయానికి వస్తే.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన పూజారి ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

 

దేశవ్యాప్తంగా ఎక్కడైన సరే.. మహిళలపై అత్యాచారం చేసిన రేపిస్టులను చంపితే.. చంపినా ప్రతి ఒక్కరికి అతను రూ.లక్ష చొప్పున ఇస్తానంటూ ప్రకటించాడు. రాజు దాస్ అనే వ్యక్తి అయోధ్యలో హనుమాన్ ఆలయంలో పూజారి. దిశ ఘటన జరిగిన కొద్దిరోజులకు అయన ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. 

 

అందులో ఆ పూజారి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా రేపిస్టులను ఎవరు చంపినా తాను రూ.లక్ష నగదు నజరానాగా ఇస్తానని ప్రకటించారు. ఒకవేళ నేరస్థులను పోలీసులే కాల్చి చంపినా కూడా వారి కుటుంబాలకు మరింత సాయం చేస్తానని అయన ప్రకటించారు... ఇలా ప్రకటిస్తూనే.. అతను ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అనేది చెప్పాడు. 

 

''ఒక అమ్మాయి 9 గంటల సమయంలో బస్సు ఎక్కితే ఆ అమ్మాయిని రాడ్డుతో కొట్టి ఆరు మంది సామూహిక అత్యాచారం చేసి అమ్మయి కడుపులో పేగులను రాడ్డుతో లాగి.. రక్తం పోతున్న ఆ యువతిని బట్టలు కూడా లేకుండా నడిరోడ్డుపై పడేశారు. అలాంటి నీచులను ఒకడు మైనర్ అని మూడేళ్లు జైలు శిక్ష విధించి వదిలేస్తే.. మిగితా నలుగురికి ఉరి శిక్ష పడినప్పటికీ గత 8 ఏళ్లుగా ఆ రేపిస్టులను పందులను మేపినట్టు మేపుతుంది.'' అలా ఘోరంగా బహిరంగంగా జరిగిన ఘటనలకే శిక్షలు పడటంలో కోర్టు ఇంత ఆలస్యం చేస్తుంది. ఇక తాజాగా జరిగే అత్యాచారాల రేపిస్టులకు ఎప్పుడు శిక్ష పడాలి.. ?ఎప్పుడు న్యాయం జరగాలి..?

 

అందుకే.. అలాంటి క్రూరమైన నేరాలకు పాల్పడే వారిని వదిలిపెట్టకూడదని, వారికి తగిన శిక్ష విధించేలా ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు తాను ఈ బంపర్ ఆఫర్ ప్రకటించినట్లు రాజు దాస్ తెలిపారు. కోర్టులు ఎన్ని శిక్షలు వేసినా అవి అమలు అయ్యే లోపు మరో ఘటన జరుగుతూనే ఉంది అని.. వాటిలో ఎలాంటి మార్పులు రావడం లేదని సమాజంలో మార్పు వచ్చేవరకు ఇలాంటి నేరాలు జరుగుతూనే ఉంటాయని అయన అభిప్రాయపడ్డారు. 

 

అయితే రాజుదాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఈ వ్యాక్యలపై పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి చర్య తీసుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: