నిర్భయ ఘటన.. ఈ ఘటన గురించి ఎంత చెప్పిన తక్కువే.. సరిగ్గా 8 ఏళ్ళ క్రితం అంటే ఈరోజు.. 9 గంటల సమయంలో అమ్మాయి బస్సు ఎక్కితే 11 గంటలకు కారుతున్న రక్తంతో బట్టలు లేకుండా నడిరోడ్డుపై ఆ యువతీ పడింది. అది కూడా 5 పర్సెంట్ పేగులతో. ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా ? ఆశ్చర్యంలో తప్పు లేదు. 

 

ఎందుకంటే.. అంత దారుణమైన ఘటన అది. ఇంకా అసలు కథలోకి వెళ్తే.. 2012 డిసెంబర్ 16.. చలికాలం అది. ఆ సమయంలో ఓ యువతీ, యువకుడు ప్రైవేట్ బస్సు ఎక్కారు. ఆ బస్సులో డ్రైవర్ తో సహా ఆరుమంది ఉన్నారు. అంతే.. కొద్దీ సమయానికి ఆ ఆరుమందిలో ఒకరు వచ్చి.. ఎందుకు ఇంతవరుకు బయట ఉన్నావ్ అంటూ అమ్మాయిపై చెయ్యి వేశాడు. 

 

అనంతరం ఆమె తిట్టడంతో కోపంతో వారు ''మెని, ఆమె స్నేహితుడును ఇనుప రాడ్ తో కొట్టారు. అత్యాచారణానికి సహకరించమని ఆమెకు ఎంత చెప్పిన వినకపోయేసరికి పక్కనే ఉన్న రాడ్ తో కొట్టారు. దారుణంగా ఆ ఆరుమంది ఒకరి తర్వాత ఒకరు సామూహిక అత్యాచారం చేశారు. 

 

అయినప్పటికీ వారికీ ఇంకా కసి తిరక ఆమె ప్రైవేట్ పార్ట్స్ లో రాడ్ పెట్టి దాదాపు 95 శాతం పేగులను బయటకు తీశారు ఆ నీచులు. ఈ ఘటన జరిగిన 14 రోజులకు నిర్భయ సింగపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడి మరణించింది.'' అయితే అప్పట్లో ఈ ఘటనపై పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. 

 

ఆ నిరసనలకు ఫలితంగా ఆ నిందితులకు ఉరిశిక్ష పడింది. అయితే ఆ నిందితులలో ఒకరు ఆత్మహత్య చేసుకొని మరణించగా.. మరొకరు టీనేజర్ అని ఉరి నుండి తప్పించుకున్నాడు. అయితే మిగితా నాలుగురు గత 8 ఏళ్ళ నుండి పందులు మేసినట్టు జైల్లోనే మేశారు.

 

ఇంకా ఇప్పుడు దిశ ఘటనతో ప్రభుత్వాలపై, కోర్టులపై ఆగ్రహం వ్యక్తం చెయ్యగా.. వారు వేసిన పిటిషన్లు కొట్టేసి వారికీ ఉరి శిక్ష వేసింది. అయితే కోర్టు వేసినట్టు జరిగి ఉంటె.. ఈరోజు ఆ నలుగురు నిందితులకు ఉరి శిక్ష పడాలి. కానీ అందులో ఒకరు మరోసారి రివ్యూ పిటిషన్ వెయ్యగా అది కాస్త 17వ తేదికి వాయిదా పడింది. 

 

అయితే ఆ రివ్యూ పిటిషన్ పెద్దగా ఉపయోగం లేదు అనుకోండి.. అది ఎలాగో కొట్టివేస్తారు. ఈ విషయం వారికీ కూడా తెలుసు. అందుకే ఆ నలుగురు నిందితులు వారికీ ఖచ్చితంగా ఉరి బిగుస్తుందనే భయంతో అన్నం, నీళ్లు కూడా వారికీ సహించడం లేదు. నిజమే.. ఆ ఒక్కరోజు కాదు అనుకొంటే అలాంటి దారుణమైన ఘటన జరిగేది కాదు. కానీ చేశారు.. ''న్యాయం ప్రకారం ఇప్పటికే వాళ్ళు చావాలి.. లేదా పక్క దేశాలలో లాగా వారికీ ప్రజలతో రాళ్లతో కొట్టించి.. హింసించి చంపాలి. కానీ మన దేశం అంత హింస ఒప్పుకోదు..'' అందుకే వారికీ కేవలం ఉరి  శిక్ష మాత్రమే వేస్తున్నారు. 

 

అయితే ఇంత నీచానికి.. అమ్మాయిని దారుణంగా చంపినా వారికీ శిక్ష వెయ్యాలని దేశమంతా భావిస్తుంటే.. ఒక తెలుగు పత్రిక మాత్రం.. ఆ నిందితులకు సపోర్ట్ గా రాసింది. పాపం ఆ నిందితులు.. నిద్ర పోవటం లేదు.. తినటం లేదు.. అంటూ కనికరం చూపిస్తుంది ఆ పత్రిక. అదే కనికరం నిర్భయపైన చూపించింటే.. ఈరోజు ఈ బాధ ఉండేది కాదు. 

 

నిజానికి.. నాకు ఆ పత్రిక పేరు రాయాలి అని ఉంది కానీ మరి నాపై కేసు పెడితే.. నేను కోర్టు చుట్టూ తిరగాలి.. ఇలాంటి విశ్లేషణలు నేను రాయలేను.. ముందే మాది చిన్న కుటుంబం, అందుకే.. పేరు రాయట్లేదు.. అంతే తప్ప ఇంకేం లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: