మనం ఎక్కడ బ్రతుకుతున్నాము. సమాజంలోనా, అడవిలోనా, అడవి మృగాల మధ్యనా, ఇప్పుడు లోకంలో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే మనుషుల మధ్య జీవించడం కంటే అడవిలో మృగాల మధ్య బ్రతకడమే మేలనిపిస్తుంది. కనీసం అవి వాటి కంట బడితే దాడి చేస్తాయనే భయంతో అయినా బ్రతికినంత కాలం బ్రతకవచ్చూ. కాని సమాజంలో అలా లేదు. ఏ మగాడు మృగమో, ఏ మగాడు రాక్షసుడో అసలే అర్ధం కాకుండా ఉంది. ఒకడు అమ్మా అంటాడు, మరొకడు అక్కా అంటాడు కాని ఈ పదాలు పెదవుల వరకే. వాడి ఆలోచనల నిండా మెదిలే కామావేశాల ముందు ఈ పిలుపులు పనిచేయవు.

 

 

ఈ పదాలు ఆడదాన్ని లొంగతీసుకోవడానికి వేసే ఎత్తులు మాత్రమే. ఇకపోతే ఒక మహిళ అని కూడా చూడకుండా పాత కక్షలు మనసులో పెట్టుకుని ఆమె పట్ల ఎంత దారుణంగా ప్రవర్తించారంటే ఆ సంఘటన తాలుకూ దృష్యాలు చూస్తుంటే అసలు ఇలాంటి వారు ఒక ఆడదాని కడుపునే పుట్టారా, వీరు తినేది అన్నమేనా అనే సందేహం వస్తుంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే అనంతపురం జిల్లా హిందూపురం మండలంలోని మనేసముద్రం గ్రామానికి చెందిన లక్ష్మీదేవి అనే మహిళను ఇద్దరు యువకులు విచక్షణా రహితంగా కొట్టారు.

 

 

బాధితురాలికి అదే గ్రామానికి చెందిన సురేశ్, శ్రీధర్‌తో గతంలో గొడవలు ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకున్న ఆ ఇద్దరు శనివారం రాత్రి ఆమె ఇంటికి వచ్చి దాడి చేశారు. ఆ మృగాల దాడికి తట్టుకోలేక తనను వదిలేయాలని, ఇంకా కొడితే చనిపోతానని వేడుకున్నా ఆ దుర్మార్గులు వినిపించుకోలేదు. ఒకరు కాళ్లు, చేతులు పట్టుకోగా, మరొకరు ఆమె గొంతు నులిమేశారు. ఆమె కుమారుడు మా అమ్మను వదలాలని వేడుకుంటున్నా వదలకుండా దాడి చేయడంతో స్పృహ తప్పి పడిపోయింది.

 

 

దీంతో వారిద్దరు అక్కడి నుంచి పరారయ్యారట. ఇకపోతే అప్పటివరకు కొయ్యాల్లా నిలుచున్న స్దానికులు అంతా జరిగాక బాధితురాలిని హిందూపురం ఆస్పత్రికి తరలించారట. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారని సమావారం. ఇక ఈ దాడి దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. దీనిపై సమాచారం అందుకున్న హిందూపురం పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారని తెలిసింది..

మరింత సమాచారం తెలుసుకోండి: