2014 ఎన్నికలకు ముందు పీకే ప్రశాంత్ కిషోర్ అంటే ఎవరో తెలియదు.  2014 ఎన్నికల సమయంలో పీకే మోడీ ప్రచార వ్యూహకర్తగా పనిచేశారు.  మోడీ ప్రచారం కోసం అయన రచించిన వ్యూహాలు సత్పఫలితాలు ఇచ్చాయి.  దీంతో అయన వెలుగులోకి వచ్చారు.  తరువాత బీహార్ లో జెడియుకు పనిచేశారు.  బీహార్ లో ఆ పార్టీ విజయం సాధించింది.  దీంతో ప్రశాంత్ కిషోర్ కు జెడియు పార్టీ ఉపాధ్యక్షుడిగా పదవిని కట్టబెట్టాడు నితీష్ కుమార్.

 ఇప్పుడు అయన ఆ పార్టీలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్నారు.  
2014లో బీజేపీకి సపోర్ట్ చేసిన ప్రశాంత్ కిషోర్ ఆ తరువాత బీజేపీ వ్యతిరేక పార్టీలతో చేతులు కలుపుతున్నారు. పంజాబ్ లో కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసి అక్కడ కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చారు.  అలానే ఆంధ్రప్రదేశ్ లో వైకాపా తరపున పనిచేశారు.  అక్కడ వైకాపా తిరుగులేని విజయం సాధించింది.  రాష్ట్ర చరిత్రలో ఎవరికి సాధ్యంగాని విధంగా 151 స్థానాల్లో విజయం సాధించింది.  


ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ బెంగాల్ లో మమతకు, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ కు సపోర్ట్ చేయబోతున్నాడు.  2020 ఫిబ్రవరిలో ఢిల్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి.  ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని చూస్తున్నాడు అరవింద్ కేజ్రీవాల్.   పథకాలు ప్రవేశపెడుతున్నా, ఎందుకో కేజ్రీవాల్ వెనకడుగు వేస్తున్నాడు.  ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్నాడు కేజ్రీవాల్.  


అందుకే ప్రశాంత్ సపోర్ట్ తీసుకున్నాడు.  మరోవైపు ప్రశాంత్ కిషోర్ దేశంలో బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తున్నారు.  జాతీయ పౌరసత్వం బిల్లుకు బీహార్ మద్దతు ఇవ్వడం పట్ల అయన తీవ్రమైన కోపంతో ఉన్నట్టు తెలుస్తోంది.  నితీష్ కుమార్ ఎందుకు ఈ బిల్లుకు మద్దతు ఇచ్చారో తెలియదు. మొత్తానికి ప్రశాంత్ కిశోర్ బీజేపీని వ్యతిరేకిస్తూ... వ్యతిరేక పార్టీలకు పనిచేస్తున్నాడు. ఇది ఆయనకు పెద్ద రిస్క్ అని చెప్పాలి.  ఎందుకంటే,  ఏదైనా తేడా కొట్టి అయన సపోర్ట్ చేసిన రాష్ట్రలో పార్టీ ఓడిపోవడం మొదలుపెడితే.. మళ్ళీ మొదటికి రావాల్సి వస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: