దేశ రాజధాని ఢిల్లీ అక్రమార్కులకు, అవినీతికి అడ్డాగా మారుతుంది. రాజధాని ఢిల్లీ లో మరోసారి అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా పట్టుబడింది. వీరిని నార్కోటిక్ డ్రగ్‌ కంట్రోల్‌ విభాగం అధికారులు పట్టుకున్నారు. అయితే.. వారి దగ్గర నుంచి రూ. 1,300 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు  రాజధాని పోలీసులు తెలిపారు. 


అలాగే వారి తో పాటుగా 9 మంది తో కూడిన అంతర్జాతీయ ముఠాను అదుపు లోకి తీసుకున్నట్లు వారు వివరించారు.వారి నుంచి రూ.100 కోట్ల విలువైన 20 కేజీల కొకైన్‌ ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠా వెనుక బడా నేతల హస్తం ఉన్నట్లు తెలుస్తోందని వారు పేర్కొన్నారు. ఇప్పుడు ఈ విషయమై ఢిల్లీ లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో రాజధానిలో ఇతర బడా వ్యక్తుల సర్కిల్స్‌ లో సంచలనం గా మారింది. అలాగే వారు కూడా మాదక ద్రవ్యాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉంటారని పోలీసులు పేర్కొన్నారు.  


అంతర్జాతీయంగా ఆస్ట్రేలియా, కెనెడా, ఇండోనేషియా, శ్రీలంక, కొలంబియా, మలేషియా, నైజీరియా దేశాలతో పాటు దేశం లోని ఢిల్లీ, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, మహారాష్ట్ర లో కొందరు గ్రూపులుగా ఏర్పడి మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ ఆపరేషన్‌లో అరెస్టయిన 9 మందిలో ఐదుగురు భారతీయులు కాగా, ఇద్దరు నైజీరియన్లు, ఒక అమెరికన్‌, మరొకరు ఇండోనేషిన్‌ ఉన్నట్లు   అధికారులు తెలిపారు. 


ఈ ఆపరేషన్‌ లోనే భాగంగా ఆస్ట్రేలియాలో నిర్వహించిన దాడుల్లో అక్కడి అధికారులు 55 కిలోల కొకైన్, 200 కిలోల మెథాంఫేటమిన్‌ ను స్వాధీనం చేసుకున్నారు. భారత్‌ లో పట్టుకున్న మాదకద్రవ్యాల విలువ అంతర్జాతీయంగా రూ.100 కోట్లు కాగా, మొత్తం ఈ డ్రగ్స్ విలువ రూ. 1300 కోట్లు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: