ప్రభుత్వ కార్యాలయాలు సమయానికి ఉద్యోగులు రాక ఖాళీగా కన్పిస్తున్నాయి. ఉన్నతాధికారికి మేలు చేసేందుకే ఉద్యోగులు ఏకంగా విధులకు దూరంగా ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా అవినీతికి పాల్పడేందుకే వత్తాసు పలుకుతున్నారన్న విమర్శ వినవస్తుంది. అందుకే బలవంతపు సెలవులకు వెళ్లినట్టుగా తెలుస్తుంది.  కర్నూల్ జీలా రిజిస్ట్రార్  కార్యాయలంలో అవినీతి రోజు రోజుకు పెరిగిపోతోంది. ఇందుకు గత మంగళవారం  కర్నూలు సబ్ రిజిస్టర్ కార్యాయలంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుపడిన కర్నూల్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ మహబూబ్ అలీ. ఇదే తరహాలో కాసులకు కకృతి పడి వక్ఫ్ బోర్డు భూములు, ప్రభుత్వ భూములు, జర్నలిస్టుల భూములను  రిజిస్ట్రేషన్లు చేసి ఎన్నో ఆరోపణలు ఎదురుకొని ఇక్కడ నుండి బదిలీ అయినా కల్లూరు సబ్రిజిస్ట్రార్  రమణరావు చేసిన రిజిస్ట్రేషన్ లన్ని  తప్పుడురిజిస్ట్రేషన్లుగా భావించిన అధికారులు ఆయనను సస్పెండ్ చేశారు.

సస్పెండ్ అయిననాటి నుండి ఇప్పటి  వరకు తిరిగి పోస్టింగ్ తెచ్చుకోవాలన్న సంకల్పంతో వివిధ ప్రయత్నాలు చేశారు. కానీ ఆ ప్రయత్నాలు ఏవీ  సఫలం కాలేకపోయాయి. ముఖ్యంగా గూడూరు సబ్ రిజిస్ట్రార్ గా ప్రయత్నం చేశారు. అప్పటికే అక్కడ మరో సబ్ రిజిస్ట్రార్  ను నియమించారు. గత మంగళవారం కర్నూల్ సబ్ రిజిస్ట్రార్  ఏసీబీకి చిక్కడంతో ఇక్కడ ఖాళీ ఏర్పడింది. కానీ అంతక ముందే సిరివెళ్లా సబ్ రిజిస్ట్రార్ గా  పనిచేస్తున్న సర్వేశ్వరనాథ్ ను కర్నూల్ సబ్ రిజిస్ట్రార్ గా  నియమిస్తూ ఉత్తరువులు జారీ చేసారు. సస్పెండ్ అయినా రమణారావుకు పోస్టింగ్ ఇచ్చేనందుకు వీలు లేకపోవడం ఉన్నతాధికారులు  సర్వేస్వరనాథ్ ను మెడికల్ లీవ్ లో పంపినట్లు సమాచారం. ఇక్కడే జాయింట్ సబ్ రిజిస్ట్రార్  గా పని చేస్తున్న శశికుమార్ ఆయప్ప స్వామి మాలధారణ చేసి ఉండటంతో ఆయన కూడా సెలవులో వెళ్లడంతో రమణారావును ఇక్కడికి పోస్టింగ్ ఇచ్చేందుకు మరింత సులభమైందనే చెప్పుకోవాలి.

రమణారావు పని తీరుపై అనేక ఆరోపణలతో పాటు ఎంతో విలువైన భూములను అప్పనంగా రిజిస్టేషన్ చేశారు.  అందుకే రమణారావు ని సస్పెండ్ చేస్తున్నామని చెప్పిన అధికారులు మాట మార్చారు. ఈ క్రమంలో  తాజాగా అదే అవినీతి అధికారికి తిరిగి పోస్టింగ్ ఇచ్చేనందుకు ప్రయత్నిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. రమణారావుకు తిరిగి పోస్టింగ్ ఇస్తుండటంఫై పలు మైనార్టీ, జర్నలిస్ట్ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రమణారావు అక్రమ రిజిస్ట్రేషన్లు చేసి కోట్ల రూపాయలు సంపాందించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మరి ఉన్నతాధికారులు అవినీతి పరులకు వంతపడతారో , అక్రమార్కులఫై కఠినంగా వ్యవరిస్తారో  అన్నది వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: