దిశపై అత్యాచారం చేసిన తరువాత హత్య చేసి ఆమెను తోడుంపల్లి టోల్ ప్లాజా నుంచి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న చటాన్ పల్లి ఫ్లైఓవర్ వద్దకు తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టారు.  దీంతో ఈ ఫ్లైఓవర్ ప్రాంతం ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది.  దేశం మొత్తం చటాన్ పల్లి అంటే ఎక్కడ ఉన్నదో గూగుల్ మ్యాప్ లో వెతికిన సంగతి తెలిసిందే.  గూగుల్ లో ఈ ప్రాంతం గురించి చర్చించారు. 


అంతేకాదు, ఆ తరువాత చటాన్ పల్లిలోనే నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.  దీంతో జాతీయ మీడియాలో ఈ ప్రాంతం గురించి హైలైట్ చేశారు.  ఈ ప్రాంతం దేశం మొత్తం ఫేమస్ అయ్యింది.  ఇప్పుడు ఆ ప్రాంతంలోకి వెళ్ళాలి అంటే ప్రజలు భయపడుతున్నారు.  ఎందుకంటే అక్కడే ఐదు హత్యలు జరిగాయి.  ఒకటి దిశ హత్య కాగా, మిగతావి నలుగురు నిందితుల ఎన్ కౌంటర్.  


ఇదిలా ఉంటె, దిశ కేసు తరువాత మహిళలపై అత్యాచారాలు తగ్గిపోతాయని అనుకున్నారు.  కానీ, తగ్గకపోగా మరింత ఎక్కువయ్యాయి.  అత్యాచారాలు పెరిగిపోయాయి.  తాజాగా చటాన్ పల్లి గ్రామానికి చెందిన నాలుగు సంవత్సరాల చిన్నారిని కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు.  చిన్నారికి చాక్లెట్ ఆశ చూపించి కిడ్నాప్ చేశారు.  బాలికను అక్కడే ఉన్న కొంతమంది పిల్లలు విషయాన్నీ స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు.  


వెంటనే పోలీసులకు విషయం చెప్పడంతో... పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.  దుండగులు ఎవరు ఏంటి ఎందుకు వచ్చారు.  ఎలా వచ్చారు అనే దాని గురించి ఆరా తీస్తున్నారు.  బాలికను ఏ ఉద్దేశ్యంతో కిడ్నాప్ చేశారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  చటాన్ పల్లి గ్రామానికి చెందిన తాపీ మేస్త్రి కుమార్తె కిడ్నాప్ కు గురైందని వార్త ఆ గ్రామంలో కలకలం రేపింది.  బైక్ వచ్చి న ఇద్దరు దుండగులు ఎవరు ఏంటి అనే విచారణ చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: