చమ్మక్ చంద్ర... ఈ పేరుని ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. అతని స్కిట్ వస్తే పనులు మానుకొని టీవీల ముందు కూర్చునే ప్రేక్షకులు చాలా మందే ఉన్నారు. అంత క్రేజ్ ఉంది ఈ జబర్దస్త్ హాస్యనటుడికి. కటిక పేదరికం నుంచి వచ్చిన చమ్మక్ చంద్ర ఎన్నో సంవత్సరాల పాటు నానా కష్టాలు పడి చివరికి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరుచుకున్నాడు. ప్రస్తుతం అతనికి సినిమాల్లో చాలా అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఒక జబర్దస్త్ నటుడు చమ్మక్ చంద్ర స్క్రీన్ పై నవ్వించినా.. బయట మాత్రం అతని వ్యక్తిత్వం చాలా భిన్నంగా ఉంటుందని కొన్ని రహస్యాలను బయట పెట్టాడు.


అతడు మరెవరో కాదు ప్రస్తుత చమ్మక్ చంద్ర స్కిట్లలో ముఖ్య కమెడియన్ సత్తిపండు. ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తాను ఒకపక్క టీచర్ జాబ్ చేస్తూ.. మరోవైపు నాటకాలు వేస్తూ ఉండే వాడని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత అనకాపల్లి లాఫింగ్ క్లబ్ లో సత్తిపండు ఒక హాస్యకరమైన స్కిట్ చేస్తున్న సందర్భంలో ఇగో సినిమా దర్శకుడు సుబ్బు గెస్ట్ గా ఆ లాఫింగ్ క్లబ్ కి వచ్చాడని, తర్వాత అతని పర్ఫామెన్స్ చూసి జబర్దస్త్ లో అవకాశం వచ్చేలా చేశాడని చెప్పాడు.

https://mobile.twitter.com/mallemalatv/status/1157636850636349441

ఆ తర్వాత చమ్మక్ చంద్ర గురించి అడిగినప్పుడు.. సత్తిపండు మాట్లాడుతూ.. 'కొంతమంది చమ్మక్ చంద్ర గురించి చాలా తక్కువ అంచనా వేస్తారు. వాస్తవానికి, చమ్మక్ చంద్ర కంటే మంచి వాడిని ఇంతవరకు నేను ఎప్పుడూ చూడలేదు.' అని చెప్పాడు. ఒకసారి జబర్దస్త్ షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒక అనాధ షూటింగ్ ప్లేస్ కి వచ్చినప్పుడు... చమ్మక్ చంద్ర కొంచెం కూడా ఆలోచించకుండా చాలా ఎక్కువ డబ్బులను ఆ అనాథకి ఇచ్చి పంపించాడని సత్తిపండు చెప్పాడు. అదే కాదు చంద్ర ఇంకా ఎన్నో దానాలను చేశాడని చెప్పుకొచ్చాడు. ఇటువంటి మంచి వ్యక్తి పై అమ్మాయిల‌ను వాడుకుంటాడ‌ని... గతంలో స్వాతి నాయుడు ఆయ‌న‌పై అబాంఢాలు వేసిందని చంద్ర అభిమానాలను ఆమెను తిట్టిపోస్తున్నారు. ప్రస్తుతం చమ్మక్ చంద్ర 'రామ సక్కనోళ్లు' అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఎంతైనా.. మన చంద్ర గ్రేట్. ఎందుకంటే ఎంత సంపాదించినా.. దానం చేసే గుణం కొంతమందికే ఉంటుంది.


https://mobile.twitter.com/telugufilmnagar/status/1170234693951709184



https://mobile.twitter.com/MangoMusicLabel/status/1124634755587162112

మరింత సమాచారం తెలుసుకోండి: