కడప జిల్లాలో వైఎస్ కుటుంబానికి రాజకీయ పరంగా ఎదురు లేదనే చెప్పాలి. రాజకీయంగా తొలినాళ్ళ నుండి వైఎస్ కుటుంబానికి విధేయులగా ఉన్న ఆదినారాయణరెడ్డి కుటుంబం.  2014 ఎన్నికల్లో కూడా వైసీపీ తరఫున గెలిచిన ఆదినారాయణ రెడ్డి ఆ తర్వాత టిడిపిలోకి వెళ్లారు. టిడిపి ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన ఆదినారాయణరెడ్డి, మే నెలలో జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. ఆయన తాజాగా బిజెపిలో చేరారు. అయితే ఇప్పుడు జమ్మలమడుగు లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఆయన సోదరులు ఇద్దరు కూడా జగన్ తో కలిసి రాజకీయంగా నడవాలని భావిస్తున్నారు.

 

 అన్నీ కుదిరితే ఈ నెల 23 వ తారీఖున వైసీపీలో జగన్ సమక్షంలో చేరాలని ముహూర్తం కూడా ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కానీ అక్కడ టీడీపీ నేత రామసుబ్బారెడ్డి కూడా వైసిపి తో టచ్ లో ఉన్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటువంటి సమయంలో వీరు ముందు అడుగు వేయటం ఆయనకి పెద్ద దెబ్బ అని చెప్పాలి.

 

సీఎం కడప జిల్లా పర్యటనలో వీరు వైసీపీ లో చేరడం దాదాపు ఖరారయ్యింది. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సోదరుడు నారాయణ రెడ్డి జమ్మలమడుగు నుండి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా  పోటీ చేసి ఓడిపోయారు. ఇంతకు ముందు వైయస్ హయాంలో 2004,2009లో కూడా మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కి కాంగ్రెస్ టికెట్ దక్కింది, ఆ రెండు సందర్భాల్లో కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. టిడిపి హయాంలో ఆదినారాయణరెడ్డి జగన్ పై వ్యక్తిగత విమర్శలు చాలా చేశారు.

 

కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ పై ఆదినారాయణ రెడ్డి సోదరుడు ప్రశంసల వర్షం గుప్పించారు. కడప జిల్లాలోని జమ్మలమడుగు లో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం ఎంతో సంతోషం అని ఆయన చెప్పారు. అలాగే జగన్ తీసుకున్న 75శాతం స్థానిక రిజర్వేషన్ కారణంగా తమ ప్రాంతానికి చెందిన అనేక మందికి ఉపాధి దొరుకుతుందని ఆయన చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: