చిన్నప్పుడు కొత్త సంవత్సరం క్యాలెండర్ చేతికి దొరకగానే దాన్ని పట్టుకుని ఆ సంవత్సరంలో ఎన్ని పండగరోజులున్నాయో, ఎన్ని సెలవులొస్తున్నాయో అని లెక్కలేసేవాళ్లం. పండగ రోజులకి స్కూలుకెళ్ళాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఆ విధంగా ముందే సెలవులెన్నని చూసుకునే వాళ్లం. అలా కొన్ని సార్లు పండగలు ఆదివారాలు వస్తే అమ్మా...ఒకరోజు మిస్ అయిపోయిందే అని బాధపడేవాళ్ళం. అలాగే పండగ సోమవారం గానీ, శనివారం గానీ వచ్చిందంటే వరుస సెలవులు దొరికాయని సంబరపడేవాళ్ళం.

 

అలా సెలవుల కోసం వెతికిన మనం పెరిగి పెద్దై ఒక పనిలో కుదురుకున్నాక సెలవు రోజులని అంత బాగా ఎంజాయ్ చేయట్లేదు. అసలు కొందరికైతే సెలవులనేవి ఎప్పుడో గానీ రావు. ముఖ్యంగా కార్మికులకు సెలవులు చాలా తక్కువగా ఉంటాయి. కొన్ని పనులకి సెలవులిస్తే నడవదు కాబట్టి సెలవులనేవి లేకుండానే పనిచేస్తుంటారు. అయితే కార్మికులకి కూడా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సెలవులని ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.

 

పరిశ్రమలు, దుకాణాలు, సూపర్ మార్కెట్లు, ఇతరత్రా వ్యాపార సంస్థల్లో పనిచేసే కార్మికులకు మరియు ఉద్యోగులకు 2020 ఏడాదికి సంబంధించిన సెలవులను తెలంగాణ శాఖ వెల్లడించింది. తెలంగాణ ఫ్యాక్టరిస్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్ చట్టం 1974, తెలంగాన షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్ చట్టం 1988 ప్రకారం సెలవులను ప్రకటించి వాటి జాబితాను విడుదల  చేసింది. దీని ప్రకారం ఆ సెలవులను తప్పనిసరిగా అమలు చేయాలి.

 

లేదంటే చట్టపరమైన శిక్షలు ఎదుర్కోక తప్పదని పేర్కొంది. ఆ సెలవు రోజులేంటో ఇప్పుడు చూద్దాం. మొదటగా సంక్రాంతి జనవరి 15, గణతంత్ర దినోత్సవం జనవరి 26, మహాశివరాత్రి మరుసటి రోజు, మే డే మే 1న, రంజాన్ మే 25, తెలంగాణ ఆవిర్భావ దినం జూన్ 2, స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15, గాంధీ జయంతి అక్టోబర్ 2, దసరా అక్టోబర్ 25, క్రిస్మస్ డిసెంబర్ 25 ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: