1953లో మద్రాస్ ప్రెసిడెన్సీలో కలిసి ఉన్న ఆంధ్ర ప్రాంతం పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగా మద్రాస్ నుంచి విడిపోయి ఆంధ్రగా ఏర్పడింది.  మూడేళ్లపాటు అంటే 1953నుంచి 1956 వరకు ఆంధ్ర ప్రాంతం ఒక రాష్ట్రంగా ఏర్పడింది.  అప్పట్లో కర్నూలు రాజధానిగా ఉన్నది.  అయితే, 1956 లో భాషా ప్రాధాన్యత కలిగిన రాష్ట్రాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఆంధ్రలో తెలంగాణను కలిపి ఆంధ్రప్రదేశ్ గా మార్చారు.  అప్పటి నుంచి తెలంగాణ విడిపోయే వరకు హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన సాగింది.  


ఇప్పడు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత రాజధాని విషయంలో పెద్ద గొడవే జరుగుతున్నది.  అమరావతి నుంచి ఇప్పుడు మూడు రాజధానులుగా మారిపోయాయి.  మూడు రాజధానులు, నాలుగు రీజియన్లుగా రాష్ట్రాన్ని విభజించి పరిపాలన చేయడానికి సిద్ధం చేస్తున్నారు.  అయితే రాజధాని విషయంలో కర్నూలును పరిగణలోకి తీసుకొని అక్కడ హైకోర్టు పెట్టాలని, వింటర్ అసెంబ్లీ ఉండాలని, అలానే మినీ సెక్రటేరియట్ కూడా ఏర్పాటు చేయాలని అంటున్నారు.  


హైకోర్టును ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో రాయలసీమ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు.  ఇప్పుడు అక్కడ హైకోర్టును ఏర్పాటు చేయగానే అభివృద్ధి జరిగిపోతుందా...? అంటే ఖచ్చితంగా లేదని చెప్పాలి.  కర్నూలులో హైకోర్టు పెట్టినంత మాత్రానా రాయలసీమ అభివృద్ధి కాదు. ఇండస్ట్రీలు ఏర్పాటు చేయాలి.  రాయలసీమ నాలుగు నీళ్లలో విరివిగా ఇండస్ట్రీలు రావాలి.  అలా వస్తేనే రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది.  


అయితే, ఇప్పుడు రాయలసీమను అభివృద్ధి చేయకుంటే తాము మరో ఉద్యమం చేస్తామని, ప్రత్యేక రాయలసీమ కోసం తాము పోరాటం చేస్తామని అంటున్నారు రాయలసీమ వాసులు.  ఇలా ఎవరికీ వారు పోరాటాలు చేసుకుంటూ...రాష్ట్రాలను విడగొట్టుకుంటూ పొతే చివరకు రాష్ట్రం ముక్కలు ముక్కలుగా కావాల్సి వస్తుంది.  జీఎన్ రావు కమిటీ చెప్పినట్టుగా నాలుగు రీజియన్లు కాస్త నాలుగు రాష్ట్రాలుగా మారిపోతాయి. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులు ఏర్పాటు చేయడం ఎంతవరకు సబబు, ఎంతమేరకు అభివృద్ధి జరుగుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: