ఇప్పుడు అంతర్జాలం వాడే ప్రతి ఒక్కరికి కూడా గూగుల్ తో అనుబంధం చాలా విలువైనది .అసలు మనము ఏ పని కావాలన్నా గూగుల్ ని అడగడం చాలా మామూలు అవుతుంది. మనము ఎక్కడన్నా దారి వెతకాలి అన్న గూగుల్ మ్యాప్స్ ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. అలాంటి గూగుల్ సీఈవో గా ఉన్న మన భారతీయుడు సుందర పిచ్చయ్య మరో ఘనత కూడా సాధించాడు. గూగుల్ మాతృ సంస్థ అయిన ఆల్ఫాబెట్ కు ఇప్పుడు ఆయనే అన్నీ తానే చూసుకుంటున్నాడు.

 

 గూగుల్ సీఈఓ గా ఆయన చూపించిన పనితీరుని గుర్తించి ఆయనకు ఆల్ఫాబెట్ బాధ్యతలు  కూడా అప్పగించారని తెలుస్తోంది. ఈ సందర్భంగా 2020 నాటి నుంచి సుందర్ పిచాయ్ కి ఏటా 14 కోట్ల ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దానితో పాటు దాదాపు 1700 కోట్ల విలువ చేసే షేర్లు కూడా లభించునున్నట్లు తెలుస్తోంది.

 

ఇందులో దాదాపు ఆరు వందల ముప్పై కోట్లు కేవలం ఆయన ఆల్ఫాబెట్ లో కనబరిచే పని తీరుపై ఆధారపడి ఉంటుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. జనవరి ఒకటవ తారీఖు నుండి సుందర్ పిచాయ్ కు ఈ వార్షిక వేతనాన్ని అందించనున్నట్లు ఆల్ఫాబెట్ సమాచారం అందించింది. ఆల్ఫాబెట్ చరిత్రలో ఇప్పటివరకు అత్యధిక స్టాక్ అవార్డు పొందినది కూడా సుందర్ పిచ్చయ్య కావడం గమనార్హం.

 

 ఆల్ఫాబెట్ సంస్థ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్జీ బ్రిన్ లు తమ పదవుల నుంచి తప్పుకోవడంతో ఈ అవకాశం సుందర పిచ్చయ్య కు అప్పగించినట్లు తెలుస్తోంది. 2015లో గూగుల్ సీఈఓగా బాధ్యతలు చేపట్టినప్పుడు సుందర పిచ్చెక్కి దాదాపు 5 కోట్ల రూపాయల వార్షిక వేతనం అందేది. ఆ తర్వాత 2016లో దాదాపు 14 వందల కోట్లు విలువ చేసే స్టాక్ అవార్డులు పొందారు. మరో వైపు సుందర్ పిచాయ్ కు ఇంత భారీ పారితోషికం ఎందుకు ఇస్తున్నారు అని ఒక ఉద్యోగి ఈ మధ్యలో కాలంలో ప్రశ్నించారు. అయినప్పటికీ గూగుల్ వర్గాలు సుందర పిచ్చయ్య  కనబరుస్తున్న పనితీరుని గుర్తించి ఆల్ఫాబెట్ పగ్గాలు ఆయనకు అప్పగించిందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: