ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతు పలుకుతూ మెగాస్టార్ చిరంజీవి శనివారం ఒక ప్రకటనను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అధికార, పరిపాలన వికేంద్రీకరణతో అభివృద్ధి సాధ్యమేనని చిరంజీవి పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధికి సీఎం జగన్ ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు. అమరావతిని శాసన నిర్వాహక, విశాఖపట్టణాన్ని కార్యనిర్వాహక, కర్నూల్‌ను న్యాయపరిపాలన రాజధానులుగా మార్చే ఆలోచనను అందరం స్వాగతించాలన్నారు. ఈ మేరకు తన పేరిట ఉన్న లెటర్ హెడ్‌‌తో ఒక ప్రకటనను మీడియాకు విడుదల చేశారు. 

 

అయితే ఈ వ్యవహారంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చిరంజీవిపై విమర్శలు కూడా చేశారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసి పదవి పొంది విభజన పాపంలో భాగమయ్యారని తీవ్ర విమర్శలు చేశారు. జగన్ సర్కార్ ప్రతిపాదనలను మెగాస్టార్ చిరంజీవి స్వాగతించడాన్ని సోమిరెడ్డి తీవ్రంగా తప్పుబట్టడమే కాకుండా.. పవన్‌ను సమర్థిస్తూ మాట్లాడారు. ఇప్పుడు ఏపీ రాజధాని విషయంలో తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రజల తరఫున పోరాడుతుంటే సమర్థిచాల్సింది పోయి కొత్త రాగం అందుకున్నారంటూ ఎద్దేవా చేశారు. అయినా తెలంగాణ వ్యాపారాలు, సినిమాలు చేసుకునే పెద్దన్నకు ఏపీ జనం కష్టాలు ఏం తెలుస్తాయంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి మళ్లీ దూకేస్తాడేమో అంటూ ఎద్దేవా చేశారు. 

 

ఇదిలా ఉంటే, ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఏర్పాటును సమర్థిస్తూ గానీ, వ్యతిరేకిస్తూ గానీ తాను ఏ విధమైన ప్రకటన చెయ్యలేదంటూ చిరంజీవి పేర్కొన్నట్టు ఆదివారం మరో లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది కూడా చిరంజీవి పేరిట ఉన్న లెటర్ హెడ్‌తోనే విడుదలైంది. 


 ‘యావత్ ఆంధ్ర ప్రజానీకానికి సవినయంగా తెలియజేయునది... ప్రస్తుతం నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానుల ఏర్పాటుని సమర్థిస్తూ గానీ, వ్యతిరేకిస్తూ గానీ నేను ఏ విధమైన ప్రకటన చెయ్యలేదు. తెలుగు ప్రజలకు చేరువచేసి, నన్నింతవాణ్ణి చేసిన సినిమా రంగం మీదే నా దృష్టి ఉంది. దయచేసి అందరూ గమనించగలరు’ అని చిరంజీవి పేరిట, ఆయన సంతకంతో సహా ఒక లేఖ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది.

  

అయితే, ఈ లేఖ ఫేక్ అని చిరంజీవి స్పష్టం చేశారు. ఈ మేరకు మీడియాకు ఒక వాయిస్ మెసేజ్‌ను పంపారు. శనివారం తాను లెటర్ హెడ్ మీద ఇచ్చిన ప్రకటన వాస్తవమని.. ఆదివారం తన పేరిట సర్క్యులేషన్‌లోకి వచ్చిన ప్రకటన అవాస్తవమని కొట్టిపారేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: