మంగళూరు నివాసి జలీల్ తన ఇంటి వెలుపల ఒక బుల్లెట్ ఎడమ కంటికి తగిలి అక్కడికక్కడే అతను ప్రాణాలను  వదిలాడు. మంగళూరులో తీవ్ర నిరసనల మధ్య తన పిల్లలను పాఠశాల వ్యాన్ ద్వారా వదిలివేసిన తరువాత అతను తన ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఈ ఘటన జరిగింది.  మంగళూరు నిరసనలలో మరణించిన జలీల్ కుటుంబం వారి జీవితాన్ని శాశ్వతంగా మార్చిన  రోజును గుర్తు చేసుకున్నది.

 

 

 

 

 

 

 

 

 

 

 

రోజువారీ కూలీ కార్మికుడిగా పనిచేస్తున్న జలీల్ (42) కర్ణాటకలోని మంగళూరులోని బందర్ ప్రాంతంలో నివసించారు. అతనికి భార్య,  ఇద్దరు పిల్లలు  షిఫానీ(14), సబిల్, (10) వున్నారు .    జలీల్ పిల్లలు పాఠశాల నుండి ఇంటికి తిరిగి వస్తుండగా  వారు ప్రయాణిస్తున్న వ్యాన్ వారిని మధ్యలోనే  వదిలివేసింది. ఆ సమయంలోనే జలీల్ వారిని  తీసుకురావడానికి  వెళ్ళాడు. అతను ఇంటికి చేరుకున్నప్పుడు, పోలీసులు అతని ఎడమ కంటి పై  కాల్చారు. ఆసుపత్రికి తరలించినప్పుడు,  వైద్యులు అతన్ని చనిపోయినట్లు ప్రకటించారు.  జలీల్ కుమార్తె తన తండ్రిని చంపినందుకు పోలీసులను నిందించింది. వారు నా తండ్రి ని నా ముందు చంపారు అని దుఃఖం తో బాధ పడుతూ చెప్పింది.

 

 

 

 

 

 

 

 

డిసెంబర్ 19 న మంగళూరులో హింసాత్మకంగా మారిన పౌరసత్వ సవరణ చట్టంపై కొనసాగుతున్న నిరసనలలో అతను పాల్గొనలేదని   జలీల్ కుటుంబం తెలిపింది.   పోలీసులు పేర్కొన్నట్లు 7,000 నుండి 9,000 మంది జన సమూహం లేదని, అయితే 50 నుండి 100 మంది మాత్రమే ఉన్నారని జలీల్ కుటుంబ సభ్యుడు ఒకరు తెలిపారు. పోలీసులు అంతా తక్కువ మందిని కూడా అదుపు చేయలేకపోయారని  ఆయన ఖండించారు.  జలీల్ భార్య మాట్లాడే స్థితి లో లేదు.  పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనల సందర్భంగా ఈ సంఘటన శుక్రవారం జరిగింది.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: