సోమవారం జరగాల్సిన ద్రావిడ మున్నేత్ర కగం (డిఎంకె) యొక్క పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) ర్యాలీకి మద్రాస్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది. ర్యాలీ  ని డ్రోన్‌లను ఉపయోగించి వీడియోగ్రాఫ్ చేయడానికి పోలీసులకు ఆదేశాల్ని ఇచ్చింది.  ర్యాలీని చెన్నైలో నిర్వహించడానికి డిఎంకెకు చెన్నై పోలీసులు అనుమతి ఇవ్వక పోవడం వాళ్ళ  ఈ ఘటన  జరిగింది.

 

 

 

 

 

 

 

 

 

 

పౌరసత్వ సవరణ చట్ట  వ్యతిరేక ప్రదర్శన చేస్తున్న డిఎంకె, మిత్రపక్షాలపై మద్రాస్ హై కోర్ట్  ముందు రెండు పిటిషన్లు దాఖలు చేశారు. పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక ర్యాలీని ఆపాలని, ఈ ర్యాలీ లు  ప్రజలను, విద్యార్థులను మరియు నిరసన స్థలాలను కూడా ప్రభావితం చేస్తాయని   పిటిషన్లు కోర్టును అభ్యర్థించాయి.   డిసెంబర్ 18 న   అత్యవసర విచారణలో,  డిఎంకె పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక ర్యాలీ  అనుమతి కోసం లేఖ దాఖలు చేసినట్లు ప్రభుత్వ న్యాయవాది న్యాయమూర్తులకు తెలియజేశారు, హింస చెలరేగితే బాధ్యత తీసుకుంటారా అని అడిగిన పోలీసులు పార్టీ స్పందనను కోరింది, డీఎంకే  నుండి ఎటువంటి సమాధానం రాలేదు అందువల్ల పోలీసులు డిఎంకె ర్యాలీ కి  అనుమతి నిరాకరించారని ప్రభుత్వ అభ్యర్ధి తెలిపారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ప్రజాస్వామ్య దేశంలో నిరసనలను ఆపలేమని, అయితే  నిరసన లలో హింస జరగకూడదు  అని కోర్టు పేర్కొంది. నిరసనల సమయంలో రాజకీయ పార్టీలు తప్పనిసరిగా నియమాలను పాటించాలని కోర్టు పేర్కొంది.   మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తులు ప్రభుత్వ పిటిషనర్‌ను    డ్రోన్‌లను ఉపయోగించి ర్యాలీని ఎందుకు వీడియోగ్రాఫ్ చేయలేరు అని అడిగారు. తర్వాత   న్యాయమూర్తులు సోమవారం పౌరసత్వ సవరణ చట్ట  వ్యతిరేక ర్యాలీకి అనుమతిస్తూ,  డిఎంకె మరియు దాని మిత్రపక్ష పార్టీ లను  డ్రోన్లను ఉపయోగించి వీడియోగ్రాఫ్ చేయమని మధ్యంతర ఉత్తర్వు జారీ చేశారు. పౌరసత్వ సవరణ చట్ట  వ్యతిరేక ర్యాలీకి రాజకీయ పార్టీలకు పోలీసులు అనుమతి ఇవ్వనందున ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి.     డిఎంకె ర్యాలీకి మరుమలార్చి ద్రావిడ మున్నేట్రా కగం (ఎండిఎంకె), విదుతలై చిరుతైగల్ కచ్చి (విసికె) మరియు నటుడు కమల్ హాసన్ యొక్క మక్కల్ నీది మయం (ఎంఎన్ఎం) మరియు ఇతర పార్టీల మద్దతు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: