ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళుతున్నారు. ఓపక్క అమరావతిలో నిరసనలు జరుగుతున్నా.. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పరుగులు పెట్టిస్తూ.. తన వంతు పాత్రను సమర్ధవంతంగా పోషిస్తూ.. ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం కడప పర్యటనలో ఉన్న ఆయన.. పులివెందుల అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

 

 

పులివెందుల జేఎన్టీయూలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, లెక్చరర్ క్వార్టర్స్‌కు సీఎం శంకుస్థాపన చేశారు. రూ.347 కోట్లతో వైఎస్ఆర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు. రూ.100 కోట్లతో పులివెందుల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఉర్దూ మీడియం స్కూల్ జూనియర్ కాలేజీగా అప్ గ్రేడ్ చేసేందుకు నిర్ణయించారు. రూ.65 కోట్లతో రక్షిత మంచినీటి పథకానికి సీఎం శంకుస్థాపన చేశారు. కోల్డ్ స్టోరేజీల నిర్మాణాలకు శంకుస్థాపన చేసారు. పులివెందులలో మినీ సచివాలయానికి రూ.10 కోట్లు కేటాయించారు. మోడల్ పోలీస్ స్టేషన్ వేంపల్లి డిగ్రీ కాలేజీకి శంకుస్థాపన చేశారు. వాటర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తామన్నారు. అన్ని రకాల వసతులతో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేస్తామన్నారు.

 

 

గాలేరు-నగరి ప్రధాన కాల్వ నుంచి వేంపల్లి, వేముల, అలవలపాడులకు నీరందించే ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. చిత్రావతి రిజర్వాయర్ నుంచి పులివెందుల, లింగాల, ఎర్రబెల్లిలకు తాగునీరు పథకానికి శంకుస్థాపన చేశారు. రూ.63 కోట్లతో వేంపల్లి అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి శంకుస్థాపన చేశారు. రూ.13.21 కోట్లతో పులివెందుల, సింహాద్రిపురం మార్కెట్ల ఆధునీకరణ చేయనున్నారు. నల్ల చెరువులో 132 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వేంపల్లి ఆస్పత్రిలో 30 పడకల నుంచి 50 పడకలకు పెంచనున్నారు. 32 గ్రామ సచివాలయ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన సీఎం. అరవీటిపల్లి వద్ద 20 టీఎంసీల డ్యామ్‌కు త్వరలో శంకుస్థాపన చేస్తామన్నారు.

 

 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ.. ‘నాన్నను అమితంగా ప్రేమించారు. ఇప్పుడు నా వెన్నంటే ఉంటున్నారు. నేను ఒంటరిని అనే బాధ లేకుండా చూసుకున్నారు. మీ బిడ్డగా రుణం తీర్చుకుంటాను’ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: