అధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్ ముఖ్య  అతిథిగా హాజరైన పాండిచ్చేరి  విశ్వవిద్యాలయ కాన్వొకేషన్ వేడుక సమావేశానికి   సోమవారం తనను   హాజరు కాకుండా ఒక సీనియర్ పోలీసు అధికారి  అడ్డుకున్నారని బంగారు పతక విజేత అయిన పాండిచ్చేరి  విశ్వవిద్యాలయ విద్యార్థిని ఆరోపించింది.  పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు కేరళకు చెందిన మరియు పాండిచ్చేరి  విశ్వవిద్యాలయ లో  మాస్ కమ్యూనికేషన్‌లో మాస్టర్స్ కోర్సు చేసిన రబీహా అబ్దురేహిమ్ యూనివర్సిటీ  కాన్వకేషన్ వేడుక  లో  బంగారు పతకాన్ని అంగీకరించడానికి నిరాకరించారు.

 

 

 

 

 

 

 

 

 

 

కాన్వొకేషన్   వేడుక ప్రారంభమయ్యే ముందు ఆడిటోరియం నుండి బయలుదేరమని,  ఒక సీనియర్ పోలీసు అధికారి తనను కోరినట్లు రబీహా అబ్దురేహిమ్  పేర్కొంది.  కాన్వొకేషన్  వేడుక లో  గ్రాడ్యుయేట్లకు బంగారు పతకాలు మరియు ధృవపత్రాలను అందజేసే కార్యక్రమం జరుగుతున్నా  సందర్భంలో    రాష్ట్రపతి  కోవింద్ ఆడిటోరియం నుండి   వెళ్ళిన తరువాత ఆమెను ఆడిటోరియంలోకి అనుమతించారు అని రబీహా  పేర్కొంది.  తనను,  ఒక సీనియర్  పోలీస్ ఆఫీసర్ ఆడిటోరియం  వదిలి వెళ్ళమని అడగటానికి గల  అసలు కారణం తనకు తెలియదని రబీహా  అన్నారు.

 

 

 

 

 

 

 

 

 

రబీహా అబ్దురేహిమ్ తాను డిగ్రీ స్క్రోల్ అందుకున్నానని, సిఎఎను నిరసిస్తున్న విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు బంగారు పతకాన్ని అంగీకరించడానికి నిరాకరించానని చెప్పారు. అధ్యక్షుడు కోవింద్  క్యాంపస్ నుండి బయలుదేరిన తరువాత విశ్వవిద్యాలయ అధికారి సర్టిఫికెట్లు మరియు పతకాలను అందజేసే  కార్యక్రమం కొనసాగింది.  బయట ఏమి జరిగిందో తమకు తెలియదని విశ్వవిద్యాలయంలోని ఒక అధికారి  తెలిపారు. కాన్వొకేషన్  వేడుక బాగా జరిగింది, అని అధికారి తెలిపారు.  అంతకుముందు, అధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్ పాండిచేరి విశ్వవిద్యాలయం యొక్క 27 వ కాన్వకేషన్ వేడుక  సమావేశంలో పాల్గొన్నారు, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా  విద్యార్థి మండలి సభ్యులు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించారు.   పాండిచ్చేరి  విశ్వవిద్యాలయ క్యాంపస్‌ లో మరియు చుట్టుపక్కల పటిష్టమైన భద్రత మధ్యలో లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి, ముఖ్యమంత్రి వి నారాయణసామి  ఈ సమావేశనికి హాజరయ్యారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: