ఆ కుర్రాడు.. ఓ ముఖ్యమంత్రికి గారాల మనవడు.. ఆ అబ్బాయి.. ఓ మంత్రి గారి కుమారుడు.. అనూహ్యంగా ఓ బాల నేరస్తుల గృహంలో కనిపించాడు. అక్కడి బాలురతో కలసి సందడి చేశాడు. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరనుకుంటున్నారా.. ఆయనే కేసీఆర్ మనవడు, కేటీఆర్ కొడుకు హిమాన్షు. మరి కేసీఆర్ మనవడు ఏంటి బాల నేరస్తుల గృహంలో ఉండటమేంటి అనుకుంటున్నారా..

 

ఏమీ లేదు. బాల నేరస్తులతో కలసి క్రిస్మస్ జరుపుకునేందుకు హిమాన్ష్ ప్లాన్ చేశాడు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తనయుడు హిమాను సైదాబాద్లోని జువైనల్ హోంలో సందడి చేశారు. క్రిస్మస్ సంబరాల్లో భాగంగా బుధవారం  జైల్ గార్డెన్ లోని తెలంగాణ బాలల సంక్షేమం, సంస్కరణల  శాఖ ఆధ్వర్యంలోని వీధి బాలుర, పరిశీలక సదనాలకు  చెందిన బాలలతో కలిసి కేకు కోశారు.

 

హిమాన్షు స్వయంగా.. దాదాపు వందమంది  బాలురకు క్రిస్మస్ కానుకలు అందజేశారు. బాలల సంక్షేమ శాఖ ఇన్ ఛార్జి సంచాలకులు శైలజతో కలిసి ఆయా సదనాలకు చెందిన కొందరు బాలురతో కలిసి హిమాను కొద్దిసేపు మాట్లాడరు. అక్కడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆ సమస్యల పరిష్కారాం కోసం తనవంతు కృషి చేస్తానని హిమాన్షు హామీ అన్నారు.

 

సదనం బాలురు చేసిన నృత్యాన్ని తిలకించిన  హిమాన్లు.. ప్రత్యేక శిక్షకుడిని ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. హిమాన్షు రాఖతో టీఆర్ఎస్ తెరాస నేతలు పెద్దఎత్తున హోం వద్దకు చేరుకున్నారు. వాళ్లంతా హిమాన్షను చూస్తే ఊరుకుంటారా… హిమానుతో కలిసి ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు.

 

స్థానిక కార్పొరేటర్ స్వర్ణలత రెడ్డి, హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ భూమేశ్వర్ తదితరులు పుష్ప గుచ్చాలు, జ్ఞాపికలు అందజేశారు. తెరాస నేతలు ధర్మరాజు, అజీమ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మొత్తానికి హిమాన్షు ప్రయత్నంపై అభినందనల వర్షం కురుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: