కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డెబిట్ కార్డు లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్) చార్జీలను ఎత్తివేస్తున్నట్లు శుభవార్త అందించారు. నిర్మలా సీతారామన్ శనివారం ప్రభుత్వ రంగ బ్యాంక్ అధిపతులతో భేటీ అయిన విషయం తెలిసిందే...డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని చర్యలను ప్రకటించింది. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను బలోపేతం చేయడానికి, నగదు తక్కువగా అవసరమయ్యే ఆర్థిక వ్యవస్థ దిశగా అడుగులు వేయడానికి ఈ చర్యలు దోహదపడతాయని ప్రభుత్వం భావిస్తోందని అన్నారు.
 

మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్) లేకుండా డిజిటల్ లావాదేవీలు నిర్వహించేందుకు నిర్ణీత చెల్లింపు విధానంగా రూపే, యూపీఐలను డిపార్ట్‌ మెంట్ ఆఫ్ రెవిన్యూ (డీఓఆర్) నోటిఫై చేయబోతున్నట్లు శనివారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రూ.50 కోట్లు లేదా అంతకన్నా ఎక్కువ టర్నోవర్ కలిగిన అన్ని కంపెనీలు తమ కస్టమర్లు తమకు చెల్లించవలసిన చెల్లింపులను రూపే డెబిట్ కార్డు, యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లించే సదుపాయం తప్పనిసరిగా కల్పించాలని డిపార్ట్‌ మెంట్ ఆఫ్ రెవిన్యూ ఆదేశాలు జారీ చేస్తుందని ఈ ప్రకటన తెలిపింది.
 

2019-20 బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చెప్పిన దాన్ని బట్టి డిజిటల్ లావాదేవీల పై ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉండకపోవచ్చునని తెలుస్తోంది. రూ.50 కోట్లు లేదా అంతకన్నా ఎక్కువ టర్నోవరు కలిగిన సంస్థలు తమ కస్టమర్లు తమకు చెల్లించవలసిన సొమ్మును భీమ్ యూపీఐ, ఆధార్ పే, డెబిట్ కార్డులు, నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ వంటి పద్ధతుల్లో చెల్లించేందుకు సదుపాయం కల్పిస్తే, అటు కస్టమర్లకు కానీ, ఇటు వ్యాపారులకు కానీ ఎటువంటి ఛార్జీలు లేదా మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) విధించబోమని నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో చెప్పిన సంగతి తెలిసిందే.
 

నిర్మల సీతారామన్ శనివారం బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. బ్యాంకులు తీసుకునే తెలివైన నిర్ణయాలకు ప్రభుత్వం మద్దతిస్తుందని తెలిపారు. వ్యాపారి చెల్లించే ప్రతి లావాదేవీకి ఎండీఆర్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకులు, పీఎఓఎస్ మెషీన్ సంస్థ, కార్డు నెట్‌ వర్క్ ప్రొవైడర్ వంటి మూడింటికీ వ్యాపారి చెల్లించే ఈ చార్జీలు వెళ్లిపోతాయి. క్రెడిట్ కార్డులపై ఎడీఆర్ చార్జీలు ట్రాన్సాక్షన్ అమౌంట్‌లో 2 శాతం దాకా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: