ఆధ్యాత్మికతకి తిరుపతి తీసిపోనిది..  అయితే... తిరుపతి పట్టణంలో శనివారం  రాత్రి 9 గంటల సమయంలో బాంబు పేలుళ్లతో కలకలం రేగింది. తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి వద్ద ఒక్కసారిగా పెద్ద శబ్దంతో బాంబు పేలుడు జరిగింది. ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్లంతా ఉలిక్కిపడి అయోమయంలోకి వెళ్లారు. నాటు బాంబులు పెట్టి ఉన్న కవర్ కుక్కలు లాక్కెళ్లడంతో పేలుడు జరిగినట్లు అధికారులు భావిస్తున్నారని తెలుస్తోంది.


అయితే.. అక్కడ నుంచి వెళ్తున్న ఒక ఆటోలో బాంబులను తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆటోలో తీసుకెళ్తున్న బాంబులను కుక్కలు నోటితో పట్టి లాక్కెళ్లినట్లు తెలుస్తోందని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా బాంబు పేలుళ్లు సంభవించాయి. దీంతో అక్కడ ఉన్నవారందరూ భయాందోళనకు గురయ్యారు. అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేసుకుని విచారిస్తున్నారు. దీంతో తిరుపతిలో భద్రతను అలెర్ట్ చేశారు.  


బాంబు పేలుడు ఘటనతో తిరుపతి ప్రజలను ఉలిక్కిపాటుకు గురిచేసింది. బాంబు పేలుడు సమాచారం అందుకున్న వెంటనే హుటాహుటిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాంబు పేలిన పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. బాంబుల కోసం గాలిస్తుండగా సమీపంలో నిలిపి ఉంచిన ఆటోలో మరో ఆరు బాంబులను పోలీసులు గుర్తించారు. అడవి పందుల కోసం నాటు బాంబులు తీసుకెళ్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.


బాంబులు కవర్‌ ను నోటకరిచి పట్టుకెళ్లిన కుక్క పేలుడులో మరణించింది. పేలుళ్ల సమయంలో సమీపంలో జన సమాచారం లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పిందని తెలియజేశారు. ప్రాణ నష్టం లేకపోవడంతో అక్కడ ఉన్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో బాంబు పేలుళ్లు కలకలం సృష్టించాయి. నాటు బాంబులు పేలడం సంచలనంగా మారింది. బాంబు స్క్వాడ్ ముమ్మరంగా తనిఖీలు చేస్తోంది. పేలుళ్లతో ఆస్పత్రి సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. నిత్యం లక్షలాది మంది తిరుమల, తిరుపతిక్లి వస్తుంటారు. అటువంటి స్థలంలో నాటు బాంబు పేలటం కలకలం రేపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: