ఉత్తర భారతంపై చలి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ఎముకలు కొరికే చలితో బయటకు రావాలంటే ప్రజలు బెంబెేలెత్తిపోతున్నారు. జమ్మూ-కాశ్మీర్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో ఎటు చూసినా మంచు దుప్పటే. అటు తెలుగు రాష్ట్రాల్లోనూ చలి తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోంది.

 

చలిగాలులు, తీవ్రంగా కురుస్తున్న మంచు కారణంగా ఉత్తరాది ప్రజలు గజగజ వణుకుతున్నారు.  జమ్మూ-కాశ్మీర్‌, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్‌పై  తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. చాలా రాష్ట్రాల్లో సింగిల్‌ డిజిట్‌ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక కాశ్మీర్‌, హర్యానా, ఉత్తరాఖాండ్‌ రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

 

ఉత్తరాఖండ్‌లో సాధారణ జనజీవనం చలితో తీవ్రంగా ఇబ్బందులు పడుతోంది. రోడ్స్‌, రైల్వేస్‌, ఎయిర్‌వేస్‌ పై కూడా చలి మంచు ఎఫెక్ట్‌ కనిపిస్తోంది. అధిక మంచు కారణంగా డెహ్రాడూన్‌ నుంచి పలు ఫ్లైట్స్‌ రద్దుకాగా.. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. జమ్మూ, కాశ్మీర్‌లో మంచు వర్షం కొనసాగుతోంది. మంచు వర్షం వల్ల రోడ్లకు, విద్యుత్‌ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. రెండు మూడు రోజుల నుంచి దీని తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. చాలా ప్రాంతాల్లో పొగమంచు కారణంగా చీకట్లు కమ్ముకున్నాయి. 

 

దేశ రాజధాని ఢిల్లీ వణికిపోతోంది. గత 118 యేళ్ల తర్వాత రాజధానిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నెలకొన్నాయి.  జనాలు బయటకు రావాలంటేనే జంకే పరిస్థితులు నెలకొన్నాయి.  డే టెంపరేచర్‌ 5 డిగ్రీలకు పడిపోయింది. పశ్చిమ యూపీలో పలు ప్రాంతాలను మంచు దుప్పటి కప్పేస్తోంది. అంతేకాదు ప్రయాగ్‌రాజ్‌తో సహా పలు ప్రాంతాల్లో విపరీతమైన చలి ఇబ్బందిపెడుతోంది.  

 

మరోవైపు  రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాత్రివేళలో వాతావరణం మరింత చల్లబడి.. ఉదయం 7 వరకూ మంచు కురుస్తూనే ఉంది. ఏపీలోని విశాఖ ఏజెన్సీలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదుకాగా.. తెలంగాణ ఆదిలాబాద్ జిల్లాలో కనిష్టానికి పడిపోయాయి.  లంబసింగి, చింతపల్లిలో 1.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.  ఉత్తరాది నుంచి శీతల గాలులు నేరుగా తెలంగాణ వైపు వీస్తున్నాయి. దీంతో  తెలంగాణ, ఉత్తర కోస్తాల్లో చలి పెరిగింది. మరికొన్ని రోజులు ఈ చలి తీవ్రత మరింత 

మరింత సమాచారం తెలుసుకోండి: