అయోధ్య రామమందిర నిర్మాణం పై భారతీయ జనతా పార్టీ వివాదాస్పద ఎంపీ సుబ్రమణియన్ స్వామి ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఈ రోజు తిరుపతి మహిళా విశ్వ విద్యాలయంలో ఏర్పాటు చేసిన సదస్సులో ప్రసంగించారు. అయన మాట్లాడుతూ... రామ మందిర నిర్మాణ ప్రారంభ తేదీ పై స్పష్టతనిచ్చారు. అయితే మరో మూడు నెలల్లో రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన చెప్పారు. 


వచ్చే ఏడాది ఏప్రిల్ 2వ (02 /04 / 2020 ) తేదీన రామ మందిరానికి భూమిపూజ చేస్తామని ఆయన తెలిపారు. అయితే 2022 నాటికి రామ మందిర నిర్మాణం పూర్తి చేస్తామని ఆయన ఈ సదస్సు లో పేర్కొన్నారు. ఇలా మాట్లాడటమే కాక., తాజా గా తిరుమల శ్రీ వారి ఆలయ ఆదాయ వివరాల పై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లలో స్వామి వారి ఆదాయ ఆడిట్ వివరాలను కోర్టు ముందుంచాలని ఆయన అభిప్రాయ పడ్డారు. స్వామి వారి ఆదాయం, ఆభరణాల వివరాలను నిగ్గుతేల్చాలన్నారు.


తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయం పూర్తిగా ప్రభుత్వ జోక్యం నుంచి బయట పడాలని సుబ్రమణియన్ స్వామి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆలయ నిర్వహణ స్వర్ణ దేవాలయం తరహాలో స్వతంత్రంగా జరగాలన్నారు. ఈ విషయం పై విస్తృత జరగాలని సుబ్రమణియన్ అన్నారు. ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న స్వామి.. వైఎస్ జగన్ సర్కార్‌ పై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత తిరుమలలో క్రైస్తవ మత ప్రచారం జరుగుతోందన్న ఆరోపణలను ఆయన ఖండించారు. ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. హిందూ విశ్వాసాలను గౌరవించేలా జగన్ సర్కార్ చర్యలు ఉన్నాయన్న స్వామి..అన్యమత ప్రచారం జరుగుతోందని ఆరోపణలు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని టీటీడీ పాలక మండలికి సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: