ఢిల్లీలో ఇద్దరు తెలుగు వైద్యులు అదృశ్యం అయ్యారు. ఇద్దరు వైద్యులు అదృశ్యమవ్వటంతో.. స్థానిక ప్రదేశంలో కలకలంగా మారింది. ఈ నెల 25 న కనిపించకుండా పోయిన వీరి ఆచూకీ మిస్టరీగా మారింది. ఈ నెల 25 న డాక్టర్‌ హిమబిందు (29), డాక్టర్‌ దిలీప్‌ సత్య (28) ఢిల్లీలో అదృశ్యమయ్యారు. దీంతో హిమబిందు భర్త డాక్టర్ శ్రీధర్‌ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 

డాక్టర్ హిమబిందు, డాక్టర్ శ్రీధర్ భార్య భర్తలు. వీరు కర్నూలు మెడికల్ కాలేజీలో చదువుకున్నారు. వీరి స్నేహితుడు డాక్టర్ దిలీప్. దిలీప్ కూడా కర్నూలు మెడికల్ కాలేజిలో చదివాడు. అప్పటి నుంచి వీరంతా మంచి ఫ్రెండ్స్. దిలీప్ సత్య ప్రస్తుతం చండీగఢ్‌ లో చిన్న పిల్లల వైద్యుడిగా పని చేస్తున్నారు. హిమబిందు ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యురాలిగా పని చేస్తోంది. అయితే ఈ నెల 24 న దిలీప్ పుదుచ్చేరి లో ఇంటర్వ్యూకి వెళ్లి తిరిగి వస్తూ 25 న ఢిల్లీలోని శ్రీధర్‌ దంపతుల ఇంట్లో ఆగారు.


అనంతరం డిసెంబర్ 25 క్రిస్మస్ రోజున ఉదయం 11.30 గంటల సమయంలో చర్చికి వెళ్తున్నామని చెప్పారు. అనంతరం హిమ బిందు, దిలీప్‌ బయటకు వెళ్లారు. అయితే కాసేపటి తర్వాత ఇద్దరి మొబైల్‌ ఫోన్లు స్విచ్ ఆఫ్‌ వచ్చింది. ఎంతసేపటికీ వీరి ఫోన్లు పని చేయకపోవడంతో చివరకు బిందు భర్త శ్రీధర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఆచూకీ కనిపెట్టాలని ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌‌ను, ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్లను అభ్యర్థించారు.


ఫ్యామిలీ ఫ్రెండ్ గా దిలీప్ ఉండడంతో బయటకు వెళ్లిన వారిద్దరి పై శ్రీధర్ కు అనుమానం రాలేదు. వెళ్తాము అంటే.. సరేనన్నాడు. ఆ తర్వాత గంట నుంచి ఇద్దరి ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయి.  అనుమానం వచ్చిన శ్రీధర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హిమబిందు, దిలీప్ లు కలిసి ఎటో వెళ్లినట్టు తెలుస్తోంది. గతంలోనే వీరికి వివాహేతర సంబంధం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరు డాక్టర్లు ఆచూకీ లేకుండా పోవడం కలకలంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: