మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో గుండె ఒకటి, గుండె వేగంలో కొద్దిపాటి తేడా వచ్చినా సరే, ఆ వ్యక్తికి అనారోగ్య సూచన ఉన్నట్లుగా చెప్తుంటారు డాక్టర్లు. తక్కువ శాతం కొవ్వులు కలిగి ఉండే పదార్ధాలు తీసుకుంటే గుండె యొక్క పని తీరు బాగుంటుందని, కావున గుండె ఎప్పుడూ పదిలంగా ఉండేలా చూసుకోవాలని డాక్టర్లు సూచిస్తుంటారు. ఏ మాత్రం మనిషి గుండె కొద్దిసేపు ఆగినా, అతడు బ్రతకడం అసాధ్యం అనేది తెలిసిందే. ఈ విధంగా మన శరీరంలో అత్యంత ఆవశ్యకమైన గుండె, కొన్ని క్షణాలు ఆగితేనే మనిషి బ్రతికే పరిస్థితి లేనప్పుడు, మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఒక ఘటనలో ఏకంగా ఆరు గంటల పాటు గుండె ఆగినా కూడా, ఆ తరువాత కొందరు విద్యార్థులు బ్రతికి బట్టకట్టారు. వివరాల్లోకి వెళితే, డెన్మార్క్ దేశంలోని ప్రస్త్రో ఫోర్డ్ ప్రాంతంలో గడ్డకట్టేంత చలి ఉండడంతో పాటు అక్కడ నీటిపై మంచు గడ్డలు తేలుతూ ఉంటాయి. అయితే దానికి కొంత దూరంలో గల ఊళ్లో గల ఒక ప్రముఖ స్కూల్ లోని విద్యార్థులు, తమ టీచర్ కత్రినా తో కలిసి ఇటీవల ప్రస్త్రో ఫోర్డ్ ప్రాంతానికి విహారానికి వెళ్లారు. 

 

ఎంతో ప్రమాదంతో కూడుకున్న ఆ ప్రాంతంలో విహారానికి వెళ్లడం ఒకింత భయంతో కూడుకున్నప్పటికీ కూడా, పిల్లలకు ఆ సాహస యాత్ర ఎప్పటికీ చెరగని మధురానుభూతిగా మిగులుతుందని భావించి, అక్కడి నదిలోకి బోటు ద్వారా అందరూ బయలు దేరారు. అయితే హఠాత్తుగా సగం దూరం వెళ్ళగానే విపరీతమైన చల్లటి ఈదురు గాలులు, అలల తాకిడి వలన బోటు ఒక్కసారిగా తిరగబడి పోవడంతో, కత్రినా సహా 12 మంది పిల్లలు కూడా నీటిలో మునిగిపోయారు. అయితే ఆ సమయంలో తనకు ఏమి అర్ధం కాలేదని, పిల్లల పరిస్థితి తలచుకుని తనకు గుండె బద్దలయిందని కత్రినా అన్నారు. అసలే అక్కడ నీటిలో ఉష్ణోగ్రత 2 డిగ్రీల సెల్సియస్ ఉందని, అందుకే వెంటనే పిల్లలందరినీ ఈదుకుంటూ తీరం చేరండని తాను గట్టిగా అరిచానని కత్రినా అన్నారు. 

 

అయితే తీరం తమకు వందల మీటర్ల దూరంలో ఉందని అర్ధమయినప్పటికీ, ఎలాగోలా ఈదుకుంటూ తాను ఒడ్డుకు చేరానని, ఒళ్ళంతా గడ్డకట్టుకుపోయినప్పటికీ అక్కడ ఎవరైనా సాయానికి వస్తారేమో అని నడుస్తుండగా కొంత దూరంలో ఒక వ్యక్తి జాడ తనకు కనడిందని, అతడిని చూడగానే హెల్ప్ అంటూ గట్టిగా అరిచానని కత్రినా చెప్పింది. అయితే అప్పటికే శరీరం తన పట్టుతప్పిపోవడం మొదలవ్వగా, తాను చనిపోతున్నట్లు భావించానని కత్రినా అన్నారు. అనంతరం ఆ వ్యక్తి సమాచారంతో  కాసేపటి తరువాత రక్షణ సిబ్బంది అక్కడికి చేరడం, అలానే మిగతా పిల్లలు సహా తనని కూడా హెలికాఫ్టర్ లో దగ్గర్లోనే ఆసుపత్రికి చేర్చడం జరిగిందని అన్నారు. తనతో సహా మొత్తం ఏడుగురు తీరానికి కొట్టుకురావడం జరిగిందని, ఆసుపత్రికి చేరిన అనంతరం మమ్మల్ని అందరినీ పరీక్షించిన డాక్టర్లు, అప్పటికే పూర్తిగా గడ్డకట్టుకుపోవడంతో మా అందరి గుండె ఆగిపోయి ఆరు గంటలకు పైగా అయిందని తేల్చారని, 

 

కానీ మిగతా అవయవాలు మాత్రం పనిచేసే అవకాశం ఉందని భావించిన డాక్టర్లు మెల్లగా ఆసుపత్రి గదిలోని ఉష్ణోగ్రతలను కొద్ది కొద్దిగా పెంచుతూ వచ్చి, ఎట్టకేలకు కాసేపటి తరువాత మా అందరిలో కదలిక వచ్చేలా చేసారని అన్నారు. కాగా ఇది తమకు రెండవ జన్మ అని, కత్రినాతో కలిసి పునర్జీవితం పొందిన వారిలో క్యాస్పర్ అనే విద్యార్థి ఎంతో ఆవేదనతో అక్కడి మీడియాతో ఘటన వివరాలు పంచుకున్నాడు. కాగా ఈ దుర్ఘటనలో చనిపోయినవారి కుటుంబాలకు నివాళులు అర్పించిన డెన్మార్క్ ప్రజలు, ఈ దారుణ ఘటనతో తీవ్ర దిగ్బ్రాంతి చెందారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: