అమరావతి గ్రామాల్లో తిరిగిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ది ఫ్లాప్ షోనే అనే అనుమానం మొదలైంది. రాజధాని గ్రామాలైన వెంకటయాపాలెం, మందడం తదితర గ్రామాల్లో పాదయాత్ర చేశారు. దాదాపు రెండు వారాలుగా ఆందోళన చేస్తున్న రైతులు, స్ధానికులను పరామర్శించేందుకు పవన్ ఈరోజు పై గ్రామాల్లో పర్యటించారు. అయితే తన పర్యటనలో పవన్ ఏమి సాధించారో ఎవరికీ అర్ధం కావటం లేదు.

 

రైతులను పెయిడ్ ఆర్టిస్టులని ప్రభుత్వం  అనటం అన్యాయమన్నారు. ప్రజావసరాలు తీర్చకుండా, రైతులకు భరోసా ఇవ్వకుండా  ప్రభుత్వం పట్టించుకోకపోవటం మంచిది కాదన్నారు. కష్టాల్లో ఉన్న రైతులకు ఊరట ఇవ్వటానికి తాను పరామర్శకు వచ్చాననే విచిత్రమైన వాదన వినిపిస్తున్నారు.  అమరావతి నిర్మాణానికి డబ్బులు లేవని చెబుతున్న జగన్  మూడు రాజధానుల నిర్మాణాన్ని మాత్రం ఎలా చేస్తారని అడగటంలోనే ఆయన అజ్ఞానం బయటపడింది.

 

విశాఖపట్నానికి రాజధానిని తరలించాలన్న తన ఉద్దేశ్యాన్ని  జగన్ స్పష్టంగా చెప్పారు. విశాఖపట్నానికి రాజధానిని తరలిస్తే కొత్తగా నిర్మాణాలేవీ చేయాల్సిన అవసరం లేదని స్పష్టంగా ప్రకటించారు. అందుబాటులో ఉన్న భవనాలనే సచివాలయంగా వాడుకుంటానని ఇప్పటికే జగన్ మంత్రివర్గ సమావేశంలో చెప్పారు. అయినా  చంద్రబాబు, పవన్ , ఎల్లోమీడియా తమ ధోరణిలోనే తాము మాట్లాడుతున్నారు.

 

అమరావతి నిర్మాణానికి డబ్బులు లేవని, విశాఖపట్నం రాజధాని అయితే నిర్మాణ ఖర్చులు ఏవీ ఉండవన్న విషయం అందరికీ తెలుసు. అయినా తెలియనట్లు జగన్ ను జనాల దృష్టిలో విలన్ గా చూపించేందుకే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టే పదే పదే అదే  మాటను మాట్లాడుతున్నారు.

 

ఇపుడు తాజాగా మందడం గ్రామంలో పర్యటించిన పవన్ ఏమి సాధించారయ్యా అంటే శూన్యమనే చెప్పాలి. ఎందుకంటే మూడు రాజధానుల ఏర్పాటు అంశంపై పవన్ ఆలోచనలతో పార్టీ ఏకైక ఎంఎల్ఏ రాపాక వరప్రసాద్ పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. తన ఏకైక ఎంఎల్ఏ రాపాకనే కన్వీన్స్ చేసుకోలేని పవన్ ఇక జనాలను ఏ విధంగా కన్వీన్స్ చేయగలరు ?

 

మరింత సమాచారం తెలుసుకోండి: