మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక పక్క నిర్మాతగా మరోపక్క హీరోగా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ జర్నీ కొనసాగిస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవిని సైరా సినిమాలో అద్భుతంగా చూపించి సినిమా సూపర్ డూపర్ హిట్ అవడం లో కీలక పాత్ర పోషించారు. సైరా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు విషయంలో రామ్ చరణ్ వ్యవహరించిన తీరు అందరినీ ఆకట్టుకొంది. చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన 'సైరా' టాలీవుడ్ ఇండస్ట్రీలో నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టింది. అటువంటి తరుణంలో చిరంజీవి మాట్లాడుతూ ఒకానొక నాకు నా జీవితంలో గర్వకారణమైన విషయం ఏమిటంటే రామ్ చరణ్ నాకు కొడుకుగా పుట్టడం అని భావోద్వేగంగా చెప్పడం. ఇటువంటి తరుణంలో ప్రస్తుతం రామ్ చరణ్ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ తో మొట్టమొదటిసారి rrr సినిమా చేస్తున్నారు.

 

ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. ఈ ఏడాది జూలై మాసంలో విడుదల కాబోతున్న ఈ సినిమా పై దేశవ్యాప్తంగా తో పాటు అంతర్జాతీయ స్థాయిలో భీభత్సమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇటువంటి తరుణంలో తాజాగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ వేడుకలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి గోవాలో జరుపుకోవడం జరిగింది.

 

చాలామంది టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు ఇతర  దేశాలకు వెళ్లిన నేపథ్యంలో రామ్ చరణ్ మాత్రం స్వదేశంలోనే గోవా రాష్ట్రంలో భార్య ఉపాసనతో కొత్త సంవత్సరంలో అడుగు పెట్టారు. ఈ సందర్భంగా చరణ్-ఉపాసన కలిసి బోటు పై తీయించుకున్న ఫోటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటోలో చరణ్ వైట్ టీ షర్టు.. గ్రే కలర్ ప్యాంట్ ధరించి క్యాజువల్ స్టైల్ లో ఉన్నారు. క్యాప్.. కళ్ళజోడు.. ఒక బ్యాగ్ తగిలించుకుని ఫోటోకు పోజిచ్చారు. భార్య ఉపాసన కూడా వైట్ డ్రెస్ లోనే రాంచరణ్ డ్రెస్ కి సూట్ అయ్యే టట్లు దుస్తులు వేసింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: