వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు టీడీపీ పై విమర్శలను గుప్పించారు. చంద్రబాబు నాయుడు వారి ముద్దుల కుమారుడు రాజధానికి విచ్చేసి అక్కడ మంటలు మండించాలని ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలన్న తాపత్రయం వారిలో కనబడుతోందని ఆయన  విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 


చంద్రబాబు నాయుడి భార్య భువనేశ్వరి రైతుల ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా, వారిపై చాలా దయ చూపించారని, ఆమె ధరించిన బంగారు గాజో లేక ప్లాటినము గాజో గానీ తృణప్రాయంగా ఉద్యమానికి ఇచ్చేశారని, అది వేలం పాట వేసుకోవాలని ఉద్యమ కారులకు చంద్రబాబు చెప్పారని ఎద్దేవా చేశారు. రైతులపై ఇంత దయ, ప్రేమ ఎందుకు చూపించారో తనకు అర్థం కాలేదు, ఎందుకంటే, చంద్రబాబు హయాంలో పత్తి రైతులు, మిర్చి రైతులు, శెనగ రైతులు ఆత్మహత్యలు చేసుకుని పిట్టల్లా రాలిపోయిన రోజున వారిపై భువనేశ్వరికి జాలి కలగలేదని విమర్శించారు. బాబు హయాంలో గోదావరి పుష్కరాల ఘటనలో మృతి చెందిన వారిపై ఆమెకు జాలి కలగలేదని, పరామర్శించలేదని, సాయం చేయాలన్న ఆలోచనా రాలేదని దుయ్యబట్టారు.


అలాగే.. రాజధాని అమరావతి రైతుల కోసం తన చేతి గాజులను విరాళంగా ఇచ్చిన విషయంలో అంబటి రాంబాబు స్పందించారు. నారా భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శనాస్త్రాలు సంధించారు. భువనేశ్వరికి రైతుల మీద ప్రేమా? లేక, అమరావతి భూములపై ప్రేమా..? అంటూ ప్రశ్నించారు. ఎప్పుడూ లేనిది అమరావతి రైతుల మీద ఎందుకు ప్రేమ కలిగిందని అన్నారు.

గత ప్రభుత్వ హయాంలో రైతులు చనిపోతే భువనేశ్వరికి జాలి కలగలేదని ఆరోపించారు. పుష్కరాల్లో 30 మంది చనిపోయినా ఆమెకు జాలి కలగలేదని, రాష్ట్రం విడిపోతున్నప్పుడు కూడా ఆమెకు బాధ లేదని విమర్శించారు.  ఇప్పుడు భువనేశ్వరి తన చేతి గాజులు ఇస్తుంటే తమకు జాలి కలుగుతోందన్నారు. ఈ సందర్భంగా రాజధాని భూములపై వైసీపీ కార్యాలయంలో వీడియో ప్రదర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: