అమరావతి నుండి సచివాలయాన్ని ప్రభుత్వం విశాఖపట్నంకు తరలించేస్తున్నారు.  ఇందుకు తగ్గ ఏర్పాట్లు తీసుకోవాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుండి కొన్ని శాఖాధిపతులకు అర్జంట్ ఆదేశాలు జారీ అయ్యాయి.  ఆదేశాలు అందుకున్న శాఖల్లో రోడ్లు, భవనాలు,   పంచాయితీ రాజ్, వైద్య ఆరోగ్యం  , జీఏడి, ఫైనాన్సింగ్, మైనింగ్, ఉన్నతవిద్య, పాఠశాల శాఖలున్నాయి.

 

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈనెల 26వ తేదీన జరగాల్సిన రిపబ్లిక్ దినోత్సవ వేడుకలు కూడా విశాఖపట్నంలోనే జరగాలని డిసైడ్ అయిపోయింది.  బహుశా రాజధాని తరలింపు,  మూడు రాజధానుల ప్రతిపాదనపై జరగబోయే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు కూడా విశాఖపట్నంలోనే జరగనున్నట్లు సమాచారం. అంటే ఇక విశాఖపట్నం సచివాలయం నుండి జగన్మోహన్ రెడ్డి పాలన మొదలవ్వబోతున్నట్లే.

 

విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్ స్క్వేర్ లోని భవనాలే సచివాలయంగా దాదాపు డిసైడ్ అయిపోయినట్లే. ఇక్కడ 8 అంతస్తుల భవనాలు ఉన్నాయట. ఇవన్నీ కూడా ప్లగ్ అండ్ ప్లే అన్న పద్దతిలో వాడకానికి రెడీగా ఉన్నాయట. ఈ మధ్యనే అధునాతన సౌకర్యాలతో  ఈ భవనాలను నిర్మించారు. అనేక కారణాలతో చాలా భవనాలు ఖాళీగానే ఉన్నాయి.  

 

ప్రతి భవనంలోను పార్కింగ్ స్పేస్, క్యాంటిన్లు, ఫుడ్ కోర్టులు, మంత్రులు, వివిధ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైనన్ని సౌకర్యాలు ఉన్నాయి. అందుకనే ముందుగా సచివాలయంతో పాటు మరికొన్ని శాఖల కార్యాలయాలను కూడా తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే తరలింపు విషయంలో ఎటువంటి లీగల్ సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది.

 

ఈనెల 8వ తేదీన అమరావతి సచివాలయంలో జరగబోయే క్యాబినెట్ సమావేశంలో  సచివాలయం తరలింపుకు అవసరమైన అనుమతులు వచ్చేస్తాయి. ఒకసారి క్యాబినెట్ ఆమెదం వచ్చేస్తే చాలా వరకూ సమస్యలు పరిష్కారమైపోయినట్లే. ఒకసారంటూ సచివాలయం తరలిపోతే  రాజధాని కూడా దాదాపు వెళ్ళిపోయినట్లే అనుకోవాలి. దాంతో  చంద్రబాబునాయుడు అండ్ కో ఎన్ని ఆందోళనలు చేసినా ఉపయోగం లేదనే చెప్పాలి.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: