ఈ మధ్యకాలంలో పెళ్లికూతుర్లకు పిచ్చి బాగా ముదిరింది. ఒకొక్కరు ఒక్కోలా ఉంటున్నారు. కొత్త స్టయిల్లో రావాలని ఆలోచిస్తున్నారో లేక వాళ్ళ పెళ్లి గురించి ప్రపంచం అంత మాట్లాడుకోవాలి అనుకుంటున్నారో అర్థం కాదు కానీ పిచ్చి మాత్రం పీక్స్ లో ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మొన్నటికి మొన్న ఆఫ్రికాలో ఉన్న ఓ వధువు పెళ్ళికి శవపీఠికలో వచ్చింది.. ఏం అంటే వెరైటీ. 

 

ఇప్పుడు ఓ పిచ్చి వధువు.. పుట్టిన పసికందుని ఆమె గౌనుకు కట్టి ఈడ్చుకెళ్లింది. ఆ తింగరి వధువు. ఇంకా వివరాల్లోకి వెళ్తే.. ఓ యువతి పెళ్లికి ముందే బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డకు ఒక నెల నిండగానే పెళ్లి చేసుకోడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే ఆమె ధరించిన వెడ్డింగు గౌను వెనకాల తన బిడ్డను పడుకోబెట్టుకుని పెళ్లి వేదిక వద్దకు నడుచుకుని వెళ్లాలని నిర్ణయించుకుంది. 

 

దీంతో ఆమె అనుకున్నదే అదును.. ఆ పని చేసి చూపించింది. ఆ యువతీ అలా పసివాడిని గౌనుతో నేలపై లాక్కొంటూ వెళ్తుంటే అక్కడికి వచ్చిన అతిథిలు ఇదేం పోయే కాలం అని ఆగ్రహించారు.. మరి కొందరు ఆ యువతీ పిచ్చి చేష్టలను ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. 

 

దీంతో ఆ ఫోటోలు చుసిన నెటిజన్లు.. ఆ యువతీ పిచ్చ తిట్లు తిడుతున్నారు. నీకు బుద్ధి ఉందా ? అసలు సిగ్గు ఉందా ? పెళ్ళికి ముందు పిల్లని కనడమే తప్పు మళ్ళి నువ్వు ఆ బిడ్డని ఆలా ఈడ్చుకెళ్తావా అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. దీంతో ఆ యువతీ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరాల్ అవుతుతోంది. 

 

ఇలా వైరల్ అవుతున్న సమయంలో ఆ యువతీ మరో విధంగా స్పందించింది. 'నా ఒక నెల వయస్సు ఉన్న నా బిడ్డ గౌనులో సురక్షితంగానే ఉంది. ఆ బిడ్డ భవంతుడి ఆధీనంలో ఉన్నాడు' అంటూ నిర్లక్ష్యపు సమాధానం చెప్పింది. ఇలాంటి పిచ్చి మాలోకాలు కూడా ఉన్నారు ఈ లోకంలో. 

మరింత సమాచారం తెలుసుకోండి: