కెసిఆర్ ఓ ఉద్యమ కారుడు.  మాస్ లీడర్.  అందులో సందేహం అవసరం లేదు.  ఏదైనా సరే ఒకటి సాధించాలని పట్టుబడితే దానిని సాధించుకునే వరకు నిద్రపోడు.  అందుకే కెసిఆర్ అంటే ప్రతి ఒక్కరికి అత్యంత ఇష్టం.  కష్టమైనా సరే ఇష్టంగా మార్చుకుంటారు.  కష్టమైనా పనులను అంతే కష్టపడి సాధించుకుంటూ ఉంటారు.  ప్రతి విషయంలో ముందుండి ప్రజలను నడిపిస్తాడు.  ఎలాంటి కష్టం వచ్చినా సరే ఇష్టంగా చూసుకుంటారు.  


ఇకపోతే, కెసిఆర్ ఎంత మంచివాడో ఆర్టీసీ కార్మికుల విషయంలో చూశాం.  న్యాయపరమైన కోరికల కోసం వాళ్ళు 53 రోజులపాటు విధులను పక్కన పెట్టి పోరాటం చేశారు.  మొదట్లో కెసిఆర్ కు వారిపై కోపం ఉన్నా... తరువాత కరుణించి కనికరించి విధుల్లోకి తీసుకున్నారు.  ఆర్టీసీ కార్మికులకు ఇప్పుడు దేవుడిగా మారాడు.  నిందించిన వ్యక్తులే పాలాభిషేకాలు చేస్తున్నారు.  కెసిఆర్ లో మరో కోణం కూడా ఉన్నది.  అదే కోపం.  కోపం అంటే కోపం కాదు.  బాధ్యత తెలియని వ్యక్తులపై ఆయనకు ఉన్న చిరుకోపం అంతే.

 
సర్కార్ స్కూల్ టీచర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  స్కూల్స్ లో పిల్లలు ఉన్నా లేకున్నా టీచర్ల జీతాలు మాత్రం చేతికి వస్తుంటాయి.  అవికూడా భారీ స్థాయిలో.  ప్రైవేట్ స్కూల్స్ కుప్పలు తెప్పలుగా పుట్టుకొచ్చిన తరువాత సర్కార్ స్కూల్స్ లో చదివేవారి సంఖ్య తగ్గిపోయింది.  దీంతో టీచర్లు స్కూల్స్ విషయం పట్టించుకోకుండా విధులకు రాకుండా తిరుగుతున్నారు.  వీరిపై కెసిఆర్ సర్కార్ దృష్టి పెట్టింది.  


ఇలా స్కూల్స్ కు వెళ్లకుండా ఎగవేత వేస్తున్న సర్కార్ టీచర్ల డేటా కావాలని ప్రభుత్వం ఆదేశించింది.  సర్కార్ ఆదేశాలకు అనుగుణంగా డేటాను కలెక్ట్ చేసి ప్రభుత్వానికి పంపించారు అధికారులు.  ఆ డేటా చూసి షాక్ అయ్యారు కెసిఆర్.  వెంటనే 14 మంది టీచర్లను విధుల నుండి తొలగిస్తున్నట్టు ఆదేశాలు జారీ చేశారు.  మరో 92 మందిని కూడా త్వరలోనే తొలగించబోతున్నారట.  ఈ 14 మందిలో కామారెడ్డిలో ఇద్దరు, నాగర్‌ కర్నూల్‌ లో ఇద్దరు, హైదరాబాద్‌ లో ఇద్దరు, ఖమ్మంలో ఒకరు, కరీంనగర్‌ లో ముగ్గురు, నిర్మల్‌ లో ఒకరు, జగిత్యాల జిల్లాలో ఇద్దరు ఉన్నట్లు తెలుస్తోంది.  టీచర్ల విషయంలో సర్కార్ ఇలా కఠినమైన నిర్ణయం తీసుకోవడంతో మిగతా ఉపాధ్యాయులు అలర్ట్ అయ్యారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: