సినీ నటుడు రాజ్యసభ సభ్యుడు మోహన్ బాబు  మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. తాజాగా నరేంద్ర మోడీతో మోహన్ బాబు  సహా ఆయన కుటుంబ సభ్యులు అందరూ భేటీ అవ్వడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అయితే నరేంద్ర మోడీతో మోహన్ బాబు భేటీ కావడం ఇదే మొదటి సారేమి  కాకపోయినప్పటికీ తాజాగా పరిస్థితుల దృష్ట్యా మోహన్ బాబు కుటుంబ సభ్యులు మొత్తం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కావడం మాత్రం ఆసక్తికరంగా మారింది. అయితే 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా మోహన్ బాబు  నినదించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడమే కాకుండా పార్టీ తరపున ప్రచారం కూడా నిర్వహించారు. అయితే మోహన్ బాబు వైఎస్సార్సీపీ పార్టీలో చేరడానికి కారణం రాజ్యసభ సీటు ఆశించడం తో పాటు టీటిపీ చైర్మన్ పదవి పై  కూడా ఆశలు పెట్టుకున్నట్లు  వార్తలు వచ్చాయి.

 

 

ఐతే మోహన్ బాబు ఈ వార్తలను ఖండించారు కూడా.ఇకపోతే  వైసిపి పార్టీలో  మోహన్ బాబుకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని భావన ఆయన లో ఉండిపోయింది అంటారు కొందరు. దీంతో వైసిపిలో చేరడం వల్ల తనకు ఏం లాభం లేదని భావించిన మోహన్ బాబు... బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు అంటూ టాక్ వస్తోంది. ఈ క్రమంలోనే మోహన్ బాబు  సహా కుటుంబం మొత్తం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కావడం కూడా దీనికి ఊతం  ఇచ్చినట్లు అవుతుందని అక్కడ అక్కడ టాక్ వినిపిస్తోంది. రాజ్యసభ సభ్యత్వం కోసమే బీజేపీలో చేరేందుకు మోహన్ బాబు  సిద్ధమయ్యారా.. లేదని  మరో టాప్ కూడా బలంగా వినిపిస్తోంది. 

 

 

 మోహన్ బాబు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యింది తన కోసం కాదని తన కూతురు మంచు లక్ష్మి రాజకీయ భవిష్యత్తు గురించి అని  వార్తలు వస్తున్నాయి. చాలా కాలంగా మంచు లక్ష్మి బీజేపీపై సానుకూల దృక్పథంతో ఉన్నారని... దీంతో బిజెపి లో చేరవచ్చు అని ఢిల్లీ బీజేపీ వర్గాల్లో  చర్చించుకుంటున్నాయట. ఇకపోతే మోహన్ బాబు  రాజ్యసభ సభ్యత్వం కోసమే బీజేపీ లోకి  వెళ్తున్నారు అని వార్తలు వస్తున్నప్పటికీ.. ఆయనకు అలాంటి ఆశలు లేవు అంటూ ఎన్నో సార్లు మోహన్ బాబు  స్పష్టం చేసారు . మోహన్ బాబు కు  ఇప్పుడు బిజెపిలో చేరాల్సిన అవసరం కూడా లేదు అని పలువురు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: