మోహన్ బాబు కుటుంబ సమేతంగా ప్రధాని మోడీని కలవడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది. మోడీ అపాయింట్ మెంట్ దొరకడం అంత సులభం ఏమీ కాదు. అలాంటిది మోహన్ బాబు మోడీతో భేటీ కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అందులోనూ ఆ కలయికకు బయటకు చెప్పుకోదగిన కారణాలు ఏమీ లేవు. దీంతో మోడీ- మోహన్ బాబు కలయికపై అనేక విధాలుగా ఊహాగానాలు ప్రారంభమయ్యాయి.

 

సాధారణంగా మోడీని కలిశారంటే.. పార్టీ చేరడానికి అని అనుకోవడం ఈజీ. అందుకే అంతా ఇంకేముంది.. మోహన్ బాబు బీజేపీలో చేరిపోతున్నాడు అంటూ కథనాలు అల్లేశారు. ఇంకొందరు ఇంకాస్త ముందుకు వెళ్లి మోహన్ బాబుకూ.. జగన్ కూ చెడింది కాబట్టే మోహన్ బాబు మోడీని కలిసి బీజేపీలో చేరుతున్నాడు అని ఇంకాస్త ముందుకు వెళ్లి ఆలోచించారు. ఇంకొంత మంది మోహన్ బాబుకూ, జగన్ కూ ఎందుకు చెడి ఉంటుందో ఊహించేస్తూ కథనాలు రాసేశారు.

 

అయితే అసలైన షాక్ ఏంటంటే.. అసలు మోహన్ బాబును మోడీ వద్దకు పంపిందే పరోక్షంగా జగన్ అన్న కోణం ఇప్పుడు బయటకు వస్తోంది. మరి జగన్ ఎందుకు మోడీ వద్దకు మోహన్ బాబును పంపాడు.. దీనికి సరైన సమాధానం కూడా వినిపిస్తోంది. అదేంటంటే.. జగన్ తాజాగా ఏపీ రాజధానిగా విశాఖను ప్రతిపాదిస్తున్నాడు కదా.. ప్రతిపాదించడం ఏంటి.. ఖరారు చేసేశాడు కూడా.. అయితే.. జగన్ ప్రతిపాదనను సినీ పరిశ్రమ స్వాగతిస్తోందట. అమరావతి కంటే.. విశాఖ రాజధాని కావడం సినీ పరిశ్రమకు మేలు. ఇప్పటికే విశాఖలో సినిమా షూటింగులు సర్వసాధారణంగా మారాయి.

 

అందుకే జగన్ విశాఖ ప్రతిపాదన సబబేనని.. మోడీ వద్దకు మోహన్ బాబును నటుడు చిరంజీవి రాయబారం పంపినట్టు తెలుస్తోంది. ఇప్పటికే చిరంజీవికి జగన్ రాజ్యసభ సీటు ఖాయం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అందుకే చిరంజీవి జగన్ కోసం మోహన్ బాబును మోడీ వద్దకు పంపారట. విశాఖకు రాజధాని తరలింపు విషయంలో కేంద్రం అడ్డుపడకుండా చూసేందుకు ఈ లాబీయింగ్ జరిగినట్టు తెలుస్తోంది. వారెవా.. టాలీవుడ్ రాజకీయం మామూలుగా లేదుగా.

మరింత సమాచారం తెలుసుకోండి: