రాజధానిగా  అమరావతినే కంటిన్యు చేయాలనే డిమాండ్ ను పక్కన పెట్టేస్తే ఆ పేరుతో కొందరు నిలువు దోపిడికి గురైపోతున్నారు. ఉద్యమ విరాళం పేరుతో ఒంటిమీదున్న బంగారాన్ని ఇచ్చేస్తున్నారు. చివరకు ఆ బంగారమంతా ఎటు పోతుందో మాత్రం ఎవరికీ తెలీటం లేదు. ఎర్రుబాలెం, విజయవాడలో ఇప్పటికే కొందరు ఉద్యమానికి మద్దతుగా తమ ఒంటిమీదున్న బంగారాన్ని సమర్పించేసుకుంటున్నారు.

 

ఇంతకీ విషయం ఏమిటంటే రాజధానిని అమరావతి నుండి విశాఖపట్నంకు తరలించేయాలని జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయిన సంగతి తెలిసిందే. దానికి వ్యతిరేకంగా రాజధాని ప్రాంతంలోని 29 గ్రమాల్లో ఆందోళన మొదలైంది. భూములిచ్చింది 29 గ్రామాల్లోని రైతులే అయినా ఆందోళన మాత్రం ఓ ఐదారు గ్రామాల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది.

 

చంద్రబాబునాయుడు ఆశించిన స్ధాయిలో ఆందోళను జరగకపోవటంతో ఏమి చేయాలో అర్దం కాలేదు. దాంతో బ్రహ్మాండమైన ప్లాన్ ఒకటి వేశారు. దాంతో ఆందోళనలపేరుతో ఎక్కడ చూసినా టిడిపి నేతలు, కార్యకర్తల హడావుడి ఒక్కసారిగా పెరిగిపోయింది.  ఇందులో భాగంగానే సెంటిమెంటును కూడా పండించటానికి తన భార్య భువనేశ్వరిని కూడా ఆందోళనల్లోకి లాగారు. ఎర్రుబాలెంలో దీక్షలో కూర్చున్న భువనేశ్వరి ఉద్యమానికి మద్దతుగా అంటూ చంద్రబాబునాయుడు సతీమణ భువనేశ్వరి తన చేతి గాజులను ఇచ్చారు.

 

దాంతో అప్పటి నుండి వాళ్ళు, వీళ్ళు కూడా బంగారాన్ని ఇచ్చేయటం మొదలైంది. భువనేశ్వరి ఇచ్చిన గాజులను వేలం వేస్తామన్నారు. ఏమి చేశారో తెలీదు. అదే సమయంలో కొందరు నేతలు సుమారు ఓ రూ. 6 లక్షల విరాళాన్ని ప్రకటించారు. అలాటే విజయవాడలో  తూర్పు ఎంఎల్ఏ గద్దె రామ్మోహన్ రావు కూడా దీక్ష చేశారు. దానికి మద్దతుగా వచ్చిన 12 మంది మహిళలు అప్పటికప్పుడు తమ ఒంటిపై ఉన్న బంగారు గొలుసులు, ఉంగరాలు, కాలి పట్టీలను ఉద్యమానికి మద్దతుగా ఇచ్చేశారు. మరో లేడి మంగళసూత్రాన్ని కూడా ఇచ్చేసింది. దాంతో మహిళలందరూ ఉద్యమానికి నిలువుదోపిడి ఇచ్చేస్తున్నారంటూ చంద్రబాబు  ప్రకటించారు.  మరి ఆ బంగారమంతా ఎటు పోతోందో ఏమో ?

 

బయటకు కనిపించేంత వరకూ బాగానే ఉంది. మరి కనిపించని వ్యవహారం మాటేమిటి ? ఉద్యమం పేరుతో  ఇంకెంతమంది మహిళల ఒంటిపైనున్న బంగారాన్ని లాగేసుకుంటున్నారో ?  అయితే మహిళలు తమ ఒంటిపైనున్న బంగారాన్ని నిలువుదోపిడి ఇచ్చేస్తే రాజధాని తరలింపు ఆగిపోతుందా ?

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: